తెలంగాణ

telangana

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 401 కరోనా కేసులు

By

Published : Feb 20, 2022, 12:27 AM IST

CORONA CASES: రాష్ట్రంలో కరోనా కొత్త కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 401 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్​ బారినపడి ఒకరు మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 5,646 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 401 కరోనా కేసులు
CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 401 కరోనా కేసులు

CORONA CASES: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39,288 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 401 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 7,86,422కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది.

తాజాగా కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం మృతుల సంఖ్య 4,109గా ఉంది. కరోనా బారి నుంచి కొత్తగా 865 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,646 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.76 శాతానికి చేరింది.

ఇదీచూడండి: 'కరోనా ఇంకా ముగియలేదు.. మనం అనుకున్నప్పుడే..'

ABOUT THE AUTHOR

...view details