తెలంగాణ

telangana

సింగరేణి నిర్వాసితులకు కూరగాయల పంపిణీ

By

Published : Apr 1, 2020, 6:16 PM IST

లాక్​డౌన్​ కారణంగా ఉపాధిలేక ఇబ్బందిపడుతున్న వారికి పలువురు దాతలు కూరగాయలు పంపిణీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సింగరేణి నిర్వాసిత కాలనీ వాసులకు.. కూరగాయల వ్యాపారి హరికృష్ణ తన వంతు సాయంగా కూరగాయలు అందజేశాడు.

vegetable merchant who distributes vegetables to the singareni colony
సింగరేణి నిర్వాసితులకు కూరగాయల పంపిణీ

సింగరేణి నిర్వాసితుల కాలనీ వాసులకు స్థానిక కూరగాయల వ్యాపారి నిత్యావసర సరకులు, కూరగాయలు పంపిణీ చేశాడు. లాక్​డౌన్​ వల్ల ఉపాధి లేక ఆర్థికంగా సతమతమతున్న సింగరేణి నిర్వాసితుల కాలనీలోని పేదలకు కూరగాయల వ్యాపారి హరి కృష్ణ, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ దిండిగాల రాజేందర్, సీఐ వేణు చందర్ ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ చేశారు.

ప్రజలందరూ తమవంతు బాధ్యతగా కష్టకాలంలో ఇబ్బంది పడుతున్న పేదలను ఆదుకునేందుకు చేతనైన సాయం చేయాలని దాతలు సూచిస్తున్నారు.

సింగరేణి నిర్వాసితులకు కూరగాయల పంపిణీ

ఇవీ చూడండి:కరోనా గురించి అంతుచిక్కని 5 రహస్యాలివే..

ABOUT THE AUTHOR

...view details