తెలంగాణ

telangana

భక్తులు లేకుండా భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు

By

Published : Apr 15, 2021, 1:57 PM IST

Updated : Apr 15, 2021, 2:29 PM IST

Sri Rama Navami celebrations
ఏకాంతంగా భద్రాద్రి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు

13:55 April 15

ఏకాంతంగా భద్రాద్రి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు

ఏకాంతంగా భద్రాద్రి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు జరగనున్నాయి. భక్తులు లేకుండా భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 21 న శ్రీరామనవమి సందర్భంగా రామయ్య కల్యాణం ఉండగా... ఈనెల 22న భద్రాద్రి రామయ్య మహాపట్టాభిషేకం జరపనున్నారు. 

కొవిడ్ నిబంధనలతో బేడా మండపంలో ఉత్సవాల నిర్వహణ జరగనుంది. ఈనెల 21, 22న అన్నిరకాల దర్శనాలు రద్దైనట్లు ఈవో శివాజీ తెలిపారు. గతేడాది కూడా కరోనా కారణంగా ఏకాంతంగానే భద్రాద్రి రామయ్య వేడుకలు జరిగాయి. 

Last Updated : Apr 15, 2021, 2:29 PM IST

ABOUT THE AUTHOR

...view details