తెలంగాణ

telangana

గోదావరిలో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం

By

Published : Jun 20, 2021, 5:42 PM IST

నీరు లేకుండా కళావిహీనంగా మారిన గోదావరి నేడు జలకళను సంతరించుకుంది. ఇసుక దిబ్బలతో దర్శనమిచ్చిన జీవనది నేడు పెరిగిన నీటి మట్టంతో చూపరులను ఆకట్టుకుంటోంది.

Godavari with water bodies
జలకళ సంతరించుకున్న గోదావరి

గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. మొన్నటివరకు నీరు లేక ఇసుక దిబ్బలతో దర్శనమిచ్చిన జీవనది నేడు జలకళను సంతరించుకుంది. శనివారం 4 అడుగులకు పరిమితమైన నీటి మట్టం.. ఆదివారం ఉదయానికి 9 అడుగులకు చేరుకుంది.

జలకళ సంతరించుకున్న గోదావరి

ఎగువ ప్రాంతాల్లో ఉన్న లక్ష్మి బ్యారేజీ నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం వల్లే గోదావరిలో నీటి మట్టం పెరిగిందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది కూడా భద్రాచలం ప్రాంతానికి వరద ముప్పు ఎక్కువగానే ఉంటుందన్న అధికారుల హెచ్చరికలతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ఇదీ చదవండి:Cm Kcr: నా కళ్లల్లో ఆనంద భాష్పాలు వస్తున్నాయ్..

ABOUT THE AUTHOR

...view details