తెలంగాణ

telangana

ఆ 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కనివ్వం: రేవంత్‌రెడ్డి

By

Published : Feb 12, 2023, 4:24 PM IST

Updated : Feb 12, 2023, 6:03 PM IST

Revanth Reddy on Dharani: ధరణి అనే ఒక పదంతో తెలంగాణ రైతాంగాన్ని అతిపెద్ద ప్రమాదంలో తెలంగాణ సర్కారు ముంచబోతోందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. హాథ్​ సే హాథ్​ జోడో పాదయాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలో యాత్ర కొనసాగిస్తోన్న ఆయన.. పార్టీ ఫిరాయింపుల పేరుతో మొయినాబాద్ ఫాంహౌస్‌ కేసును బీజేపీ.. సీబీఐకి అప్పగించినట్లే కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోయిన 12 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసును కూడా సీబీఐకి అప్పగించాలని డిమాండ్‌ చేశారు.

Revanth Reddy
Revanth Reddy

Revanth Reddy on Dharani: పార్టీ ఫిరాయింపుల పేరుతో మొయినాబాద్ ఫాంహౌస్‌పై నమోదైన కేసును బీజేపీ.. సీబీఐకి అప్పగించినట్లే కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోయిన 12 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసును కూడా సీబీఐకి అప్పగించాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. హాథ్​ సే హాథ్​ జోడో పాదయాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి యాత్ర కొనసాగుతోంది. అశ్వాపురంలో గత రాత్రి బస చేసిన రేవంత్ రెడ్డి.. ఇవాళ ఉదయం ఇష్ఠాగోష్టిగా మాట్లాడారు.

2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఫిరాయింపులకు పాల్పడ్డ 12 మందిలో ఏ ఒక్కరినీ ఈసారి అసెంబ్లీ మెట్లు ఎక్కనీయకుండా గట్టి ప్రణాళిక రచించినట్లు రేవంత్​రెడ్డి పేర్కొన్నారు. పార్టీ మారడంతో పినపాక ఎమ్మెల్యే పొందిన లబ్ధిని పూర్తిస్థాయిలో విచారణ జరిపి ప్రజలకు ఆప్పగించే పని కాంగ్రెస్ చేసి తీరుతుందని ఆయన తెలిపారు.

Revanth criticizes Congress defecting MLAs: జిల్లాలోని ముంపు మండలాల్లో ఉన్న నిరుద్యోగ యువకులకు ప్రభుత్వం ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్‌ చేసిన ఆయన.. మణుగూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని తిరిగి స్థానిక ఎమ్మెల్యే అప్పగించకుంటే జరగబోయే పరిణామాలు అన్నింటికీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. పదే పదే మొయినాబాద్ ఫాంహౌస్ కేసు గురించి మాట్లాడుతున్న బీజేపీ.. 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల కేసు కూడా అదే తరహాలో విచారణ జరిపించుకుంటే ఈ రెండు పార్టీలు ఒకే గూటికి చెందినవిగా భావించాల్సి వస్తోందని ఆరోపించారు.

ధరణి అనే ఒక పదంతో తెలంగాణ రైతాంగాన్ని అతిపెద్ద ప్రమాదంలో తెలంగాణ సర్కారు ముంచబోతోందని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతుకు కూడా రైతుబంధు అందిస్తామని హామీ ఇచ్చారు. రాజధాని చుట్టూ లక్షల ఎకరాల కబ్జా కోసమే ధరణి పుట్టుకొచ్చిందని పేర్కొన్న ఆయన.. రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే అని.. ధరణి కచ్చితంగా రద్దు చేస్తామని ప్రకటించారు. కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టు కుంభకోణం కంటే ధరణి దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా మారబోతుందని ఆయన విమర్శించారు.

"2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి ఫిరాయింపులకు పాల్పడ్డ 12 మందిలో ఏ ఒక్కరినీ ఈసారి అసెంబ్లీ మెట్లు ఎక్కకుండా గట్టి ప్రణాళికతో ముందుకు వెళ్తాం. పార్టీ ఫిరాయింపుల పేరుతో మొయినాబాద్ ఫాంహౌస్‌పై నమోదైన కేసును బీజేపీ.. సీబీఐకి అప్పగించినట్లే కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోయిన 12 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసునూ సీబీఐకి అప్పగించాలి. ధరణి అనే ఒక పదంతో తెలంగాణ రైతాంగాన్ని అతిపెద్ద ప్రమాదంలో తెలంగాణ సర్కారు ముంచబోతోంది."- రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు

ఆ 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కనివ్వం: రేవంత్‌రెడ్డి

ఇవీ చదవండి:

2 లక్షల జనాభాకు ఒక మార్కెటైనా ఏర్పాటు చేయాలనేది లక్ష్యం: సీఎం కేసీఆర్

అక్రమాలకు తావులేకుండా భవన నిర్మాణ అనుమతులు: కేటీఆర్‌

మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బండ ప్రకాశ్‌ ఎన్నిక.. శుభాకాంక్షలు తెలిపిన సీఎం, మంత్రులు

Last Updated :Feb 12, 2023, 6:03 PM IST

ABOUT THE AUTHOR

...view details