తెలంగాణ

telangana

కాసేపట్లో రాఘవను మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చనున్న పోలీసులు

By

Published : Jan 8, 2022, 10:05 AM IST

Updated : Jan 8, 2022, 11:58 AM IST

palvancha family suicide case accused Vanama raghava live updates
పాల్వంచ ఆస్పత్రిలో వనమా రాఘవకు వైద్య పరీక్షలు

09:59 January 08

కొవిడ్ పరీక్షల్లో వనమా రాఘవకు నెగెటివ్

palvancha family suicide case: రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఎట్టకేలకు.... అర్ధరాత్రి భద్రాద్రి జిల్లా దమ్మపల్లి మండలం మందలపల్లి వద్ద వనమా రాఘవను అరెస్ట్‌ చేశారు. రాఘవతో పాటు అతడి అనుచరుడు గిరీశ్‌, కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. పాల్వంచలోని సబ్‌ డివిజన్‌ కార్యాలయానికి తరలించారు. దాదాపు 10 గంటలపాటు వనమా రాఘవను పోలీసులు సుదీర్ఘంగా ప్రశ్నించారు.

ఆరోగ్యం మెరుగ్గానే...

Vanama raghava: వనమా రాఘవపై గతంలో నమోదైన కేసులపైనా పోలీసులు ఆరా తీశారు. ఉదయం ఏఎస్పీ కార్యాలయంలో రాఘవకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కొవిడ్‌ పరీక్షల నిమిత్తం పాల్వంచ ఆస్పత్రికి తరలించారు. కరోనా సహా బీపీ, షుగర్‌ పరీక్షలు నిర్వహించారు. అతడి ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు. కొంత ఆందోళనకు గురవుతున్నట్లు వెల్లడించారు. పోలీసులు విచారణ చేసుకోవచ్చన్నారు. పరీక్షల అనంతరం రాఘవను మళ్లీ ఏఎస్పీ కార్యాలయానికి తరలించారు. కాసేపట్లో మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చనున్నారు.

ఇవాళ మరో వీడియో

Vanama raghava updates: ఆత్మహత్యకు ముందు రామకృష్ణ తీసుకున్న సెల్ఫీ వీడియో బయటపడటంతో వనమా రాఘవ అరాచకాలు వెలుగుచూశాయి. ఆస్తి వివాదం సహా కుటుంబపరంగా వేధింపులకు గురిచేసినట్లు రామకృష్ణ వివరించారు. ఇవాళ మరో వీడియో బయటకు వచ్చింది. రాఘవతో పాటు తల్లి, సోదరి కారణంగా ఆస్తుల పంపకం విషయంలో మరింత క్షోభ అనుభవించానంటూ రామకృష్ణ తెలిపారు.

Last Updated : Jan 8, 2022, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details