తెలంగాణ

telangana

devotees crowd in Bhadrachalam: భద్రాద్రి రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు

By

Published : Dec 26, 2021, 12:39 PM IST

devotees crowd in bhadrachalam : పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాద్రి రామయ్య సన్నిధికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చారు. మరోవైపు ఆదివారం సందర్భంగా లక్ష్మణ సమేత సీతారాములకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.

devotees crowd in bhadrachalam
devotees crowd in bhadrachalam

devotees crowd in bhadrachalam : భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. క్రిస్మస్‌, వారాంతం సెలవులు రావటంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు భారీగా స్వామివారి దర్శనానికి కదిలి రావడంతో క్యూలైన్లు నిండిపోయాయి.

ప్రధాన ఆలయంలోని లక్ష్మణసమేత సీతారాములకు ఆదివారం వేళ పంచామృతాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం, బంగారు పుష్పాలతో అర్చన చేశారు. బేడా మండపంలో జరిగే నిత్య కల్యాణ వేడుకలో భక్తుల సందడి నెలకొంది.

భద్రాద్రి రామయ్య దర్శనానికి పోటెత్తిన భక్తులు

ఇదీ చూడండి:Yadadri temple rush: యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. కోలాహలంగా ఆలయ పరిసరాలు

ABOUT THE AUTHOR

...view details