తెలంగాణ

telangana

కన్ఫ్యూజన్‌ చేయడానికే భాజపా తప్పుడు ప్రచారం చేస్తోంది: భట్టి

By

Published : Apr 25, 2022, 5:36 PM IST

Batti Vikramarka on PK: రాజకీయ వ్యుహాకర్త ప్రశాంత్‌ కిషోర్ విషయంలో మీడియాలో వచ్చే ఊహాగానాలను నమ్మవద్దని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి పని చేస్తున్నామని... ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్​ క్యాడర్​ను కన్ఫ్యూజన్‌ చేయడానికి భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

batti Vikramarka
batti Vikramarka

Batti Vikramarka on PK: రాజకీయ వ్యుహాకర్త ప్రశాంత్‌ కిషోర్ విషయంలో తమ అధిష్ఠానం ఒక కమిటీ వేసిందని... ఆ నివేదిక చూసిన తర్వాత సోనియాగాంధీ నిర్ణయం తీసుకుంటారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తెలిపారు. భాజపా ఎప్పుడూ తప్పుడు ఆరోపణలు చేస్తూనే ఉంటుందని విమర్శించారు. కాంగ్రెస్‌లో ఎవరికీ కన్ఫ్యూజన్‌ అవసరం లేదని స్పష్టం చేశారు. కొందరు పనిగట్టుకుని కావాలనే ఆరోపణలు చేస్తున్నారని భట్టి పేర్కొన్నారు. మాణిక్కం ఠాగూర్ చేసిన ట్వీట్‌లో తప్పేముందని అన్నారు. శత్రువును నమొద్దు అన్నారు కానీ ఎవరూ శత్రువు అని చెప్పారా అని భట్టి ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భట్టి ధీమా వ్యక్తం చేశారు. పీకే విషయంలో మీడియాలో వచ్చే ఊహాగానాలను నమ్మవద్దని చెప్పారు. అలాంటి కథనాలపై తాము స్పందించమని తెలిపారు. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి పని చేస్తున్నామని... ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్​ క్యాడర్​ను కన్ఫ్యూజన్‌ చేయడానికి భాజపా తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఎన్నికల వ్యూహకర్త, ఐప్యాక్‌ సారథి ప్రశాంత్‌ కిశోర్‌(పీకే) భేటీపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స్పందించారు. తెరాసతో తెగదెంపులు చేసుకునేందుకే పీకే కేసీఆర్‌ను కలిశారని చెప్పారు. ఇక ప్రశాంత్ కిశోర్‌తో తెరాసకు, ఐ ప్యాక్‌కు పీకేకు ఎలాంటి సంబంధం ఉండదని రేవంత్‌ అన్నారు. తాను ముందు నుంచి చెప్పిందే ఇప్పుడు జరిగిందన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరిన తర్వాత రాష్ట్రానికి వచ్చి తనతో ఉమ్మడి ప్రెస్‌మీట్‌ పెట్టే రోజు దగ్గర్లోనే ఉందని రేవంత్‌ చెప్పారు. ఆ రోజు పీకే స్వయంగా తెరాసను ఓడించండని ఆయన నోటి నుంచి చెప్పడం వింటారన్నారు. పీకే కాంగ్రెస్‌లో చేరాక ఆయనకు పార్టీ అధిష్ఠానం మాటే ఫైనల్‌ అని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి :'ఆరోజు పీకేనే తెరాసను ఓడించాలని చెబుతారు'

పీకే​కు కాంగ్రెస్​ షరతు.. అందుకు ఓకే అంటేనే పార్టీలోకి.. తెరాస, వైకాపాతో కటీఫ్​?

ABOUT THE AUTHOR

...view details