తెలంగాణ

telangana

పేకాట స్థావరంపై దాడులు... ఏడుగురు అరెస్ట్

By

Published : Jul 29, 2020, 7:43 AM IST

పేకాట స్థావరంపై దాడి చేసిన టాస్క్​ఫోర్స్ పోలీసులు ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్టు చేసి... 46 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్న ఘటన ఇల్లందు మండలం తోటపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

attacks-on-a-poker-site-and-seven-members-arrest-at-yellandu-in-badhradi-kothagudem
పేకాట స్థావరంపై దాడులు... ఏడుగురు అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం తోటపల్లి గ్రామ శివారులోని పేకాట స్థావరంపై టాస్క్​ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి... వారి నుంచి 46 వేల రూపాయల నగదుతో పాటు... 23 మోటార్ బైక్​లను స్వాధీనం చేసుకున్నారు.

పట్టుకున్న వాహనాలను ట్రాక్టర్లలో పోలీస్ స్టేషన్​కు తరలించారు. పోలీసుల రాకను కొందరు గమనించి అక్కడి నుంచి పారిపోయారు. వారి గురించి ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలను అధికారులు ఇప్పటివరకు వెల్లడించలేదు.

ఇదీ చూడండి:టూర్స్‌ అండ్ ట్రావెల్స్‌: షెడ్డులకే వాహనాలు.. తప్పని కష్టాలు

ABOUT THE AUTHOR

...view details