తెలంగాణ

telangana

డెంగీ లక్షణాలతో నాలుగోతరగతి చిన్నారి మృతి

By

Published : Sep 15, 2019, 9:32 PM IST

కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామవరంలో డెంగీ లక్షణాలతో ఓ చిన్నారి మృతిచెందింది. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్​ తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచింది.

డెంగీ లక్షణాలతో నాలుగోతరగతి చిన్నారి మృతి

భద్రాద్రి జిల్లా కొత్తగూడెం మున్సిపాలిటీలోని రామవరంలో డెంగీ వ్యాధి లక్షణాలతో నాలుగో తరగతి చిన్నారి నక్షత్ర మృతిచెందింది. నక్షత్ర తండ్రి వీర నాగేంద్ర సింగరేణిలో కార్మికునిగా జీవనం సాగిస్తున్నాడు. నాలుగు రోజుల కిందట జ్వరంతో బాద పడుతున్న కుమార్తెను సింగరేణి ఆస్పత్రిలో చేర్పించాడు. జ్వరం తీవ్రత ఎక్కువ కావడం వల్ల హైదరాబాద్​కు తరలించాలంటూ వైద్యులు సూచించారు. మార్గమధ్యలో పరిస్థితి విషమించి చిన్నారి నక్షత్ర తుదిశ్వాస విడిచింది.

పారిశుద్ధ్య లోపమే కారణం

తన కుమార్తె మరణానికి సింగరేణి అధికారుల నిర్లక్ష్య వైఖరే కారణమని వీర నాగేంద్ర ఆరోపించాడు. పారిశుద్ధ్య లోపంతో ప్రజలు అల్లాడిపోతున్నా పట్టించుకోవడం వాపోయాడు. సాక్షాత్రు ఆరోగ్య శాఖ మంత్రి పర్యటించి, సూచనలిచ్చినా పరిస్థితిలో మార్పు రాలేదని మాజీ కౌన్సిలర్​ వెంకటేశ్వర్లు అధికారుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

డెంగీ లక్షణాలతో నాలుగోతరగతి చిన్నారి మృతి

ఇవీ చూడండి: లాంచీ ప్రమాద ఘటనలో పర్యటకుల వివరాలివే...!

Intro:కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని రామారం లో డెంగీ వ్యాధి లక్షణాలతో ఓ చిన్నారి మృతి చెందింది నక్షత్ర 4వ తరగతి చదువుతోంది బాధపడుతున్న ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు సింగరేణి కార్మికుల గా పనిచేస్తున్న వీర నాగేంద్ర ,జ్యోతి దంపతులకు ఇద్దరు సంతానం గాక నక్షత్ర వారి ఏకైక కుమార్తె నాలుగు రోజుల కిందట జగన్ తో బాధపడు తొందరగా సింగరేణి ప్రధాన వైద్యశాలలో చేర్పించారు


Body:నాలుగు రోజుల పాటు చికిత్స పొందిన ఆమె చివరకు డెంగీ వ్యాధి లక్షణాలతో మృతి చెందింది సింగరేణి కానీ మున్సిపాలిటీ గాని సరైన పారిశుధ్య నిర్వహణ చేపట్టక పోవడంతో ఆ ప్రాంతంలో dengue ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు


Conclusion:బైట్స్: 1.వీర నాగేంద్ర, విద్యార్థిని తండ్రి 2.వెంకటేశ్వర్లు మాజీ కౌన్సిలర్

ABOUT THE AUTHOR

...view details