తెలంగాణ

telangana

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: విత్తన వ్యాపారుల ఆగడాలపై స్పందించిన మంత్రి

By

Published : Jun 9, 2021, 2:29 PM IST

విత్తన వ్యాపారుల ఆగడాలపై ఈటీవీ భారత్ ప్రచురించిన కథనంపై మంత్రి నిరంజన్ రెడ్డి స్పందించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

adilabad, minister niranjan reddy
ఆదిలాబాద్​ విత్తన ఆగడాలు, మంత్రి నిరంజన్ రెడ్డి,

ఆదిలాబాద్ జిల్లాలోని విత్తన వ్యాపారుల ఆగడాలపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. జిల్లాలో నిర్ణయించిన ధరలకన్నా అధికంగా విక్రయించడం, విత్తనాలు మొలకెత్తకపోతే తమకు సంబంధం లేదని పత్రాలపై రాసే వైనంపై ఈటీవీ భారత్ కథనాన్ని ప్రచురించింది.

దీనిపై స్పందించిన మంత్రి... సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:బొక్కేస్తున్నారు.. చెక్కేస్తున్నారు..!

ABOUT THE AUTHOR

...view details