తెలంగాణ

telangana

వర్షం వచ్చినా రైతువేదిక నిర్మాణాలు ఆపొద్దు: కలెక్టర్​

By

Published : Sep 22, 2020, 9:51 PM IST

రైతు వేదిక నిర్మాణాల్లో అలసత్వం వహిస్తే సహించేది లేదని కలెక్టర్​ సిక్తా పట్నాయక్​ స్పష్టం చేశారు. శ్యాంపూర్​, నర్సాపూర్​ గ్రామాల్లో పర్యటించిన పాలనాధికారి.. పనులు నత్తనడకన సాగడంపై ఆరా తీశారు. వర్షాలు కురిసినా ప్లాస్టిక్​ కవర్లు ఏర్పాటుచేసి నిర్మాణాలు కొనసాగించాలని సూచించారు.

adilabad collector
వర్షం వచ్చినా రైతువేదిక నిర్మాణాలు ఆపొద్దు: కలెక్టర్​

రైతు వేదిక నిర్మాణ పనులను అక్టోబర్ పదో తేదీలోపు పూర్తిచేయాలని ఆదిలాబాద్ జిల్లా పాలనాధికారి సిక్తా పట్నాయక్​ అధికారులను ఆదేశించారు. శ్యాంపూర్, నర్సాపూర్ గ్రామాల్లో కొనసాగుతున్న రైతు వేదిక నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. పనులు నత్తనడకన సాగడానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. వర్షం కురిసినా ప్లాస్టిక్ కవర్లు ఏర్పాటుచేసి,నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు.

వర్షం వచ్చినా రైతువేదిక నిర్మాణాలు ఆపొద్దు: కలెక్టర్​

ఉట్నూరు జడ్పీటీసీ రాఠోడ్​ చారులత.. వర్షాలు కారణంగా పంట నష్టపోయిన సోయా రైతులను.. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ అంశంపై సంబంధిత అధికారులు పరిశీలించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్​ ఆదేశించారు.

అనంతరం నర్సాపూర్​లో పర్యటించారు. ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, ప్రభుత్వాస్పత్రిలో వైద్యులను నియమించాలని స్థానిక ప్రజాప్రతినిధులు కలెక్టర్​ను కోరారు. కరోనా నేపథ్యంలో వైద్యులను డిప్యుటేషన్​పై పంపిన విషయం వాస్తవమేనని.. మీరు కోరిన విధంగా వైద్యులను నియమించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

నిర్మాణ పనులకు ఇసుకతో ఇబ్బంది కలుగుతోందని ఎంపీపీ జయవంత్​రావు.. పాలనాధికారి దృష్టికి తీసుకెళ్లారు. ఇసుక కొరత లేకుండా చూడాలని స్థానిక తహసీల్దార్​ను కలెక్టర్​ ఆదేశించారు.

ఇవీచూడండి:'కొత్త వ్యవసాయ చట్టంతో రైతులకు మేలు జరుగుతుంది'

ABOUT THE AUTHOR

...view details