తెలంగాణ

telangana

టీవీ, కరెంట్ లేదు.. హాకీ మ్యాచ్ కోసం ఆ గ్రామ ప్రజల కష్టాలు!

By

Published : Aug 3, 2021, 11:11 AM IST

టోక్యో ఒలింపిక్స్​లో భాగంగా జరిగిన భారత మహిళల హాకీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్​ చూసేందుకు ఝార్ఖండ్​లోని ఓ గ్రామం విశ్వప్రయత్నాలనే చేసింది. ఊర్లో టీవీ లేకపోవడం, వర్షం కారణంగా విద్యుత్​ సరఫరా లేని కారణంగా అవసరమైన ఏర్పాట్లను చేసుకొని మ్యాచ్​ను తిలకించారు. ఇందుకు కారణం ఏంటంటే.. భారత మహిళా హాకీ టీమ్​లో ఆ గ్రామానికి చెందిన సలీమా టేట్​ ఉండటమే!.

Salima Tete family members about Hockey Semifinal in Tokyo Olympics
హాకీ మ్యాచ్​ చూసేందుకు ఆ ఊర్లో ఏం చేశారంటే?

ఒలింపిక్స్​ చరిత్రలోనే తొలిసారి సెమీఫైనల్​లో అడుగుపెట్టింది భారత హాకీ మహిళల జట్టు. విశ్వక్రీడల క్వార్టర్స్​లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్​లో 1-0 తేడాతో భారత అమ్మాయిలు గెలిచారు. ఈ టీమ్​లో ఝార్ఖండ్​కు చెందిన సలీమా టేట్​.. అనే పేదింటి అమ్మాయి కూడా ఉంది. ఆమె తల్లిదండ్రులు బడ్కిచాపర, సిమ్డేగాతో పాటు సోదరి మహిమ పొలం పని చేసుకుంటూ బతుకునీడుస్తున్నారు. వీరింట్లో కనీసం టీవీ కూడా లేదు. ఆ గ్రామంలో ఇంటర్నెట్ కూడా సరిగా లేదు. దీంతో సలీమా ఆటను చూసేందుకు ఎంతగానో శ్రమించారు ఆ గ్రామస్థులు.

ఏం జరిగిందంటే?

ఝార్ఖండ్​ జిల్లాలోని బడ్కిచాపరలో గ్రామంలో వారం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న కారణంగా కొన్ని రోజులుగా కరెంట్​ సరఫరా లేదు. ఆ గ్రామంలో సుమారు 45 కుటుంబాలున్నా.. ఒక్క టీవీ కూడా లేకపోవడం గమనార్హం. అలాగే మొబైల్​ ఇంటర్నెట్​ వాడేందుకూ సదుపాయమూ లేదు. అలాంటి పరిస్థితుల నడుమ జీవిస్తున్న ఆ గ్రామస్థులు.. తమ అమ్మాయి ఆట చూసేందుకు చాలా కష్టపడ్డారు. క్వార్టర్స్​లో ఆస్ట్రేలియాతో తలపడనున్న మ్యాచ్​ను చూసేందుకు ప్రత్యేక వనరులను ఏర్పాటు చేసుకున్నారు. ఓ జనరేటర్​ ఏర్పాటు చేసి.. అక్కడున్న ప్రజలంతా కలిసి ఆ మ్యాచ్​ను తిలకించారు. ఆస్ట్రేలియాపై భారత జట్టు గెలవడం చూసి వారెంతో మురిసిపోయారు.

ఆ మ్యాచ్​లో భారత మహిళల జట్టు ఒలింపిక్స్​లో సెమీస్​కు చేరడంపై ఆమె కుటుంబసభ్యులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. సలీమా టేట్​ పట్ల తామెంతో గర్వంగా ఉన్నట్లు ఆమె తల్లిదండ్రులతో పాటు సోదరి మహిమ వెల్లడించారు.

"మా అమ్మాయి పట్ల మేమెంతో ఆనందంగా, గర్వంగా ఉన్నాం. ఒలింపిక్స్​ సెమీఫైనల్​లోనూ నెగ్గి.. వారంతా(భారత హాకీ మహిళల జట్టు) బంగారు పతకంతో స్వదేశానికి తిరిగి వస్తారని ఆశిస్తున్నాం. మా గ్రామస్థులంతా ఎంతో ఆనందంగా ఉన్నారు. హాకీ మ్యాచ్​లను మేమంతా కలిసి చూస్తున్నాం" అని సలీమా టేట్​ కుటుంబసభ్యులు వెల్లడించారు.

సలీమా తండ్రి
సలీమా తల్లి
సలీమా సోదరి మహిమ

ఇదీ చూడండి..పేదరికం వెనక్కి లాగితే.. పట్టుదల ఒలింపిక్స్‌కు చేర్చింది!

ABOUT THE AUTHOR

...view details