తెలంగాణ

telangana

రవి దహియాకు ప్రశంసల వెల్లువ.. మోదీ ఫోన్​

By

Published : Aug 5, 2021, 6:34 PM IST

Updated : Aug 5, 2021, 7:02 PM IST

టోక్యో ఒలింపిక్స్​లో రజతం నెగ్గిన భారత రెజ్లర్‌ రవికుమార్‌ దహియాకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​​ కోవింద్ సహా పలువురు ప్రముఖులు ట్వీట్లు చేసి, మెచ్చుకున్నారు. మోదీ ఫోన్​ చేసి కొనియాడారు.

ravi dahiya
రవి దహియా

టోక్సో ఒలింపిక్స్​లో భారత రెజ్లర్​ రవికుమార్ దహియా చూపిన అసమాన ప్రతిభకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అతడు .. పురుషుల రెజ్లింగ్​ 57 కేజీల ఫ్రీస్టైల్​ విభాగంలో రజతం గెల్చుకున్నాడు.

రతజ పతకంతో రవి దహియా
స్వర్ణ, కాంస్య పతక విజేతలతో రవికుమార్ దహియా

టోక్యో ఒలింపిక్స్​లో రవి దహియా రజతం పతకం సాధించటంపై దేశం గర్విస్తోంది. ఎన్నో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొని నువ్వు విజయాన్ని దక్కించుకున్నావు. నువ్వొక నిజమైన ఛాంపియన్​. భారత ఖ్యాతిని నలు దిశలా చాటిన నీకు శుభాకాంక్షలు.

-- రామ్​నాథ్​​ కోవింద్, రాష్ట్రపతి

మోదీ ఫోన్​..

టోక్యో ఒలింపిక్స్​లో రజతం సాధించిన రవి దహియాకు ప్రధాని మోదీ.. ఫోన్​ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు అతని కోచ్​ అనిల్ మాన్​తోనూ ఫోన్లో సంభాషించారు. అతని విజయం దేశానికి స్ఫూర్తినిస్తోందన్నారు. ఆగస్టు 15న తాను స్వయంగా రవిని కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

రవికుమార్ దహియా ఓ అసాధారణ మల్లయోధుడు. అతని పోరాటం అద్భుతం. ఒలింపిక్స్​లో రజతం సాధించినందుకు శుభాకాంక్షలు. అతని విజయం దేశానికి గర్వకారణం.

-- ప్రధాని నరేంద్ర మోదీ

మన మల్లయోధుడు రవికుమార్ దహియాకు శుభాకాంక్షలు. అద్భుత ప్రదర్శనతో ఒలింపిక్స్​లో రజతం పొందాడు. భారత క్రీడా చరిత్రలో ఇది గర్వించదగ్గ సందర్భం.

-- వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి

"భారత్​కు విజయం దక్కింది! నువ్వు సాధించావ్ రవి! శుభాకాంక్షలు! ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన నీ ప్రదర్శన ప్రతి భారతీయుడికి గర్వకారణం."

-- అనురాగ్​ ఠాకూర్​, కేంద్ర క్రీడాశాఖ మంత్రి

టోక్యో ఒలింపిక్స్​లో రజతం సాధించిన రవి దహియాకు శుభాకాంక్షలు. నీ మొదటి గేమ్​ను మానసికంగానూ దృఢంగా ఎదుర్కొన్నావు. ప్యారిస్​ 2024కు అవకాశం మెరుగైంది. బెస్ట్​ఆఫ్ లక్​.

-- అభినవ్​ బింద్రా, భారత షూటర్

ఇదీ చదవండి:Olympics: భారత్​కు మరో పతకం.. రెజ్లర్​ రవి దహియాకు రజతం

Last Updated :Aug 5, 2021, 7:02 PM IST

ABOUT THE AUTHOR

...view details