తెలంగాణ

telangana

పారాలింపిక్స్ పతక​​ విజేతలతో ప్రధాని మోదీ ఆత్మీయ సమ్మేళనం

By

Published : Sep 9, 2021, 11:49 AM IST

టోక్యో పారాలింపిక్స్​లో పతకాలు సాధించిన భారత​ క్రీడాకారులను ఇప్పటికే ప్రత్యేకంగా మెచ్చుకున్న ప్రధాని మోదీ(modi meets olympic athletes).. వాళ్లతో గురువారం(సెప్టెంబరు 9) ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. వారితో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ.. వారి విజయాలను, కృషిని కొనియాడారు.

modi paralympics
పారాలింపిక్స్​​ అథ్లెట్లతో ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ(modi meets olympic athletes).. టోక్యో ఒలింపిక్స్​ ప్రారంభం అవ్వకముందు నుంచి ఇప్పటివరకు(పారాలింపిక్స్​ ముగిసిన తర్వాత) భారత అథ్లెట్లలో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపుతూనే ఉన్నారు. ఇటీవల ఒలింపిక్స్​ పతక విజేతలకు ఆత్మీయ అతిథ్యం ఇచ్చిన మోదీ.. ఇప్పుడు పారాలింపిక్స్​లో మెడల్స్​ సాధించిన అథ్లెట్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఒక్కో క్రీడాకారుడితో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. వారి విజయాలను, కృషిని ప్రశంసించారు. అంతకుముందు కేంద్ర క్రీడామంత్రి అనురాగ్​ ఠాకూర్​ కూడా అథ్లెట్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

పారాలింపిక్స్​​ అథ్లెట్లతో ప్రధాని మోదీ

గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టోక్యోలో జరిగిన పారాలింపిక్స్​లో(tokyo paralympics india medals) భారత్ అదరగొట్టేసింది.​ చరిత్రలో లేనంత అత్యుత్తమ ప్రదర్శనతో తమ ప్రయాణాన్ని ముగించింది. ఉత్కంఠంగా సాగిన ఈ పోటీల్లో మన అథ్లెట్లు అద్భుత ప్రదర్శన కనబరిచి దేశప్రజల మనసులు గెలుచుకున్నారు. పారాలింపిక్స్​లో ఎక్కువ పతకాలు(19) సాధించి దేశ గౌరవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లారు. ఇందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలు ఉన్నాయి.

పారాలింపిక్స్​​ అథ్లెట్లతో ప్రధాని మోదీ
పారాలింపిక్స్​​ అథ్లెట్లతో ప్రధాని మోదీ
పారాలింపిక్స్​​ అథ్లెట్లతో ప్రధాని మోదీ

ఇదీ చూడండి: Paralympics 2021: మనోళ్లు పతకాల ప్రభంజనం.. చరిత్రలోనే తొలిసారి

ABOUT THE AUTHOR

...view details