తెలంగాణ

telangana

French Open 2021: ఫ్రెంచ్‌ ఓపెన్‌పై సింధు గురి

By

Published : Oct 26, 2021, 8:09 AM IST

డెన్మార్క్‌ ఓపెన్‌లో క్వార్టర్‌పైనల్లో నిరాశపరిచిన పి.వి సింధు.. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో(French Open 2021) టైటిల్‌పై గురి పెట్టింది. మంగళవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్​లో జూలీ జాకోబ్‌సెన్​తో సింధు తలపడనుంది.

French Open 2021
ఫ్రెంచ్‌ ఓపెన్‌పై సింధు గురి

భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు.. ఫ్రెంచ్‌ ఓపెన్‌(French Open 2021) సూపర్‌ 750 టోర్నీపై దృష్టిసారించింది. డెన్మార్క్‌ ఓపెన్‌లో క్వార్టర్‌పైనల్లో నిరాశపరిచిన సింధు.. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో(French Open 2021) టైటిల్‌పై గురి పెట్టింది. మంగళవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్​లో జూలీ జాకోబ్‌సెన్​తో (డెన్మార్క్‌) మూడో సీడ్‌ సింధు తలపడుతుంది.

మరో స్టార్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ తొలి రౌండ్​లో సయాక తకహాషితో(జపాన్‌) పోటీ పడుతుంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్​లో టాప్‌ సీడ్‌ కెంటొ మొమొటతో(జపాన్స్‌) శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌తో సాయి ప్రణీత్‌, జొనాథన్‌ క్రిస్టీతో(ఇండోనేసియా) సమీర్‌వర్మ, బ్రైస్‌ లెవెర్‌దెజ్‌తో(ఫ్రాన్స్‌) కశ్యప్‌ తలపడతారు.

ఇదీ చూడండి:ప్రియుడ్ని పెళ్లాడిన టెన్నిస్​ స్టార్​ ప్లేయర్​

ABOUT THE AUTHOR

...view details