తెలంగాణ

telangana

300 వారాల పాటు 'నంబర్​వన్​'గా జకోవిచ్​​

By

Published : Dec 22, 2020, 8:58 AM IST

సెర్బియా టెన్నిస్​ స్టార్ నొవాక్​ జకోవిచ్​ ప్రపంచ నంబర్​వన్​ స్థానంలో కొనసాగుతూ.. డిసెంబరు 20తో 300 వారాలు పూర్తి చేసుకున్నాడు. ఫెదరర్​ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా జకోవిచ్​ నిలిచాడు.

Djokovic Becomes Second Player To Reach 300 Weeks At No. 1
300 వారాల పాటు 'నంబర్​వన్​'గా జకోవిచ్​​

సెర్బియా టెన్నిస్‌ స్టార్‌ నొవాక్‌ జకోవిచ్‌ అరుదైన ఘనత సాధించాడు. టెన్నిస్​లో ప్రపంచ నంబర్​వన్​గా డిసెంబరు 20తో 300 వారాలు పూర్తి చేసుకున్నాడు. ఫెదరర్​ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా ఉన్న ఫెదరర్‌ను అందుకునేందుకు జకోవిచ్‌కు కావాల్సింది మరో పది వారాలే. ఫెదరర్‌ 310 వారాల పాటు అగ్రస్థానంలో ఉన్నాడు. 33 ఏళ్ల జకోవిచ్‌ తొలిసారి 2011 జులైలో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజయంతో అతడు అయిదోసారి మొదటి స్థానానికి చేరుకున్నాడు.

ఇదీ చూడండి:'టీమ్​ఇండియా తిరిగి పుంజుకోవడం కష్టమే'

ABOUT THE AUTHOR

...view details