తెలంగాణ

telangana

భారత్ స్కోర్ కంటే పెట్రోల్ ధరే ఎక్కువ కదయ్యా!

By

Published : Nov 1, 2021, 2:40 PM IST

టీ20 ప్రపంచకప్​లో న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియా ఘోరంగా ఓడిపోయింది. ఈ టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్​లు ఓడి సెమీస్ బెర్తును సంక్లిష్టం చేసుకుంది. ఈ నేపథ్యంలో అసహనానికి గురైన అభిమానులు.. కోహ్లీసేనపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు.

IND vs NZ
భారత్

టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా దారుణ ఓటములకు సగటు అభిమాని నిజంగానే తీవ్ర నిరాశకు గురవుతున్నాడు. ప్రపంచకప్‌ టోర్నీల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై తిరుగులేని రికార్డున్న టీమ్‌ఇండియా.. తొలి మ్యాచ్‌లోనే ఓటమిపాలైంది. దీంతో ఆటలో ఎవరికైనా గెలుపోటములు సహజమే అని చాలా మంది తేలిగ్గా తీసుకున్నారు. కానీ, న్యూజిలాండ్‌తో ఆట చూశాక ఇది అసలు కోహ్లీసేనేనా..? టైటిల్‌ ఫేవరెట్‌ జట్టేనా..? అనే అనుమానం కలిగింది.

క్రీజులో నిలబడి ఆడాలనే పట్టుదల ఏ ఆటగాడిలోనూ కనిపించలేదు. వచ్చిన బ్యాటర్లు అందరూ వచ్చినట్లు షాట్లు ఆడటం పెవిలియన్‌ చేరడం.. ఏదో వచ్చామా.. ఆడామా.. వెళ్లామా అన్నట్లు కనిపించింది. ఈ క్రమంలోనే చివరికి అతి కష్టం మీద 110/7 పరుగులు చేసి ఏదో నెట్టుకొచ్చారు. ఆ తర్వాత బౌలింగ్‌లో రాణించి విజయంపై ఆశలు పెంచుతారేమో అని ఎదురుచూసిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. కివీస్‌ ఛేదనలో 14.3 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని పూర్తిచేసింది. దీంతో టీమ్‌ఇండియా సెమీస్‌ అవకాశాలు దాదాపు మూసుకుపోయాయి.

ఈ నేపథ్యంలోనే తీవ్ర అసహనానికి గురైన అభిమానులు, నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో కోహ్లీ సేనపై విమర్శలు గుప్పిస్తున్నారు. దారుణమైన ట్రోలింగ్‌ చేస్తున్నారు. కోచ్‌ రవిశాస్త్రి, మెంటార్‌ ధోనీ, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ.. ప్రతి ఒక్కర్నీ టార్గెట్‌ చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీసేన కొట్టిన స్కోర్‌.. భారత్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర కంటే తక్కువే అని వ్యంగ్యంగా మీమ్స్‌ పెడుతున్నారు. ఐపీఎల్‌లో రాణిస్తూ.. ఇక్కడ విఫలమవడంపైనా కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్‌ను బ్యాన్‌ చేయాలంటూ పోస్టులు చేస్తున్నారు.

ఇవీ చూడండి: టీమ్ఇండియా బ్యాట్స్​మెన్ ఎలా ఔటయ్యారో చూడండి!

ABOUT THE AUTHOR

...view details