తెలంగాణ

telangana

Commonwealth Games 2026: షూటింగ్‌ ఇన్​.. రెజ్లింగ్‌ ఔట్​.. భారత్​ మెడల్స్​పై ఎఫెక్ట్​ ఉంటుందా?

By

Published : Oct 5, 2022, 11:06 AM IST

Updated : Oct 5, 2022, 11:12 AM IST

Shooting returns Wrestling dropped from 2026 Commonwealth Games
Shooting returns Wrestling dropped from 2026 Commonwealth Games

Commonwealth Games 2026: కామన్వెల్త్‌ గేమ్స్‌లోకి షూటింగ్‌ తిరిగొచ్చింది. అయితే అదే సమయంలో రెజ్లింగ్‌ను తొలగించింది కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌. విక్టోరియా వేదికగా జరుగనున్న 2026 కామన్వెల్త్​ గేమ్స్‌లో ఉండబోయే స్పోర్ట్స్‌ జాబితాను విడుదల చేసింది.

Commonwealth Games 2026: 2022 కామన్వెల్త్​ గేమ్స్‌ నుంచి మిస్‌ అయిన షూటింగ్‌.. 2026 గేమ్స్‌కు తిరిగి వచ్చింది. భారత్​కు అత్యధిక పతకాల పంట పండించిన షూటింగ్‌ తిరిగి రావడం గుడ్‌న్యూస్. కానీ ఇదే సమయంలో రెజ్లింగ్​ను తొలగించింది కామన్వెల్త్​ గేమ్స్​ ఫెడరేషన్. 2022​ గేమ్స్‌లో రెజ్లింగ్‌లోనే భారత్​కు 12 పతకాలు (6 స్వర్ణం, 1 రజతం, 5 కాంస్యం) వచ్చాయి.

2026లో విక్టోరియాలో జరగనున్న కామన్వెల్త్‌ గేమ్స్‌లో ఉండబోయే స్పోర్ట్స్‌ లిస్ట్‌ను కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ మంగళవారం ప్రకటించింది. మొత్తం 20 క్రీడలు, 26 క్రీడాంశాలు ఉండనున్నట్లు వెల్లడించింది. ఇందులో షూటింగ్‌ను చేర్చి రెజ్లింగ్​ను తొలగించింది. ఇప్పుడీ రెజ్లింగ్‌ 2026 గేమ్స్‌లో లేకపోవడం.. ఇండియా పతకాల సంఖ్యపై ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

నిజానికి కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్​ ఆటగాళ్లు.. షూటింగ్​లోనే అత్యధిక మెడల్స్‌ సాధించారు. షూటింగ్‌లో ఇప్పటి వరకు భారత్​కు 135 పతకాలు వచ్చాయి. అందులో 63 గోల్డ్‌ మెడల్స్ ఉన్నాయి. రెజ్లింగ్‌లో 114 మెడల్స్ (49 గోల్డ్) వచ్చాయి.

ఇక ఆర్చరీకి కూడా 2026 కామన్వెల్త్‌ గేమ్స్‌లో చోటు దక్కలేదు. 2026 గేమ్స్‌లో షూటింగ్‌, రెజ్లింగ్‌ను చేర్చాలని ఇండియన్‌ ఒలింపిక్‌ అసోసియేషన్‌.. కామన్వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ను కోరింది. ఈ రెండు గేమ్స్​ వల్ల ఈవెంట్‌ వైభవం మరింత పెరుగుతుందని కూడా చెప్పింది. అయితే ఫెడరేషన్‌ మాత్రం షూటింగ్‌ను చేర్చి, రెజ్లింగ్‌ను తొలగించింది.

ఇవీ చదవండి:బుమ్రా స్థానంలో ఎవరు అన్నది అప్పుడే నిర్ణయిస్తాం: రోహిత్‌

భారత్​ భారీ మూల్యం చెల్లించుకుంది: ఆకాశ్‌ చోప్రా

Last Updated :Oct 5, 2022, 11:12 AM IST

ABOUT THE AUTHOR

...view details