తెలంగాణ

telangana

CWG 2022: తెలంగాణ అమ్మాయి నిఖత్​ జరీన్​కు గోల్డ్

By

Published : Aug 7, 2022, 7:19 PM IST

Updated : Aug 7, 2022, 10:20 PM IST

nikhat zareen gold
nikhat zareen gold

19:12 August 07

CWG 2022: తెలంగాణ అమ్మాయి నిఖత్​ జరీన్​కు గోల్డ్

CWG 2022: తెలంగాణ అమ్మాయి, ప్రపంచ ఛాంపియన్‌ నిఖత్‌ జరీన్.. కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 48-50 కేజీల (లైట్‌ ఫ్లై) విభాగంలో నార్తరన్‌ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌న్యూయ్‌పై అద్భుత విజయం సాధించి పసిడి పతకం నెగ్గింది. దీంతో భారత్‌ ఖాతాలో 17వ స్వర్ణం వచ్చి చేరింది.

ఈ ఏడాది మే నెలలో ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లోనూ నిఖత్‌ అద్భుతమైన ప్రదర్శనతో పసిడి పతకంతో మెరిసింది. తాజాగా కామన్వెల్త్‌ క్రీడా పోటీల్లోనూ తన ప్రత్యర్థి, నార్తన్‌ ఐర్లాండ్‌కు చెందిన కార్లే మెక్‌న్యూయ్‌పై బౌట్లో ఆరంభం నుంచే శివంగిలా విరుచుకుపడిన నిఖత్‌.. తన పవర్‌ పంచ్‌లతో ఉక్కిరిబిక్కిరి చేసింది.

గతంలో నిఖత్‌ మెరుపులు..

  • టర్కీలో జరిగిన 2011 ప్రపంచ జూనియర్‌, యూత్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం.
  • 2014 నేషన్స్‌ కప్‌లో స్వర్ణం
  • 2015 జాతీయ సీనియర్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం
  • 2016 దక్షిణాసియా ఫెడరేషన్‌ క్రీడల్లో కాంస్యం
  • 2018 సెర్బియాలోని బెల్‌గ్రేడ్‌లో జరిగిన టోర్నీలో స్వర్ణం
  • 2019 థాయ్‌లాండ్‌ ఓపెన్లో రజతం
  • 2019, 2022ల్లో స్ట్రాంజా మెమోరియల్‌లో పసిడి
  • 2022 మే నెలలో ఇస్తాంబుల్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం
Last Updated :Aug 7, 2022, 10:20 PM IST

ABOUT THE AUTHOR

...view details