తెలంగాణ

telangana

వెయిట్​లిఫ్టర్​ మీరాబాయ్ ప్రపంచ రికార్డు

By

Published : Apr 18, 2021, 8:16 AM IST

Updated : Apr 18, 2021, 9:22 AM IST

భారత క్రీడాకారిణి మీరాబాయ్ చాను.. వెయిట్​ లిఫ్టింగ్​లో ప్రపంచ రికార్డు సృష్టించింది. దీనితో పాటే తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును అధిగమించింది.

Mirabai Chanu sets Clean and Jerk World Record
వెయిట్​లిఫ్టర్​ మీరాబాయ్ ప్రపంచ రికార్డు

భారత స్టార్‌ వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను ప్రపంచ రికార్డు సృష్టించింది. ఆసియా వెయిట్‌లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 49 కిలోల విభాగంలో క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 119 కేజీలు ఎత్తి జియాంగ్‌ (చైనా, 118 కేజీలు) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును అధగమించింది.

స్నాచ్‌లో 86 కేజీలు లిఫ్ట్‌ చేసిన చాను.. మొత్తంగా 205 కేజీలు ఎత్తి తన పేరిటే ఉన్న ఓవరాల్‌ వెయిట్‌ జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. కాంస్య పతకాన్ని కూడా గెలిచింది. గతేడాది ఫిబ్రవరిలో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లో మీరాబాయి 203 కేజీలు (88 కేజీలు స్నాచ్‌, 115 క్లీన్‌ అండ్‌ జెర్క్‌) ఎత్తి రికార్డు నెలకొల్పింది. ఇప్పటికే తప్పనిసరిగా పాల్గొనాల్సిన ఆరు క్వాలిఫయింగ్‌ ఈవెంట్లలో పోటీపడిన చాను.. టోక్యో ఒలింపిక్స్‌ బెర్తునూ ఖరారు చేసుకుంది. ఏడాదికి పైగా విరామం తర్వాత మీరాబాయి బరిలో దిగిన తొలి టోర్నీ ఇదే.

Last Updated :Apr 18, 2021, 9:22 AM IST

ABOUT THE AUTHOR

...view details