తెలంగాణ

telangana

పతక పంచ్​: ప్రపంచకప్​ సెమీస్​లోకి హైదరాబాదీ

By

Published : Dec 19, 2020, 7:53 AM IST

అంతర్జాతీయ వేదికపై హెదరాబాద్​ కుర్రాడు అదరగొట్టాడు. ప్రపంచకప్​ బాక్సింగ్​ టోర్నీలో మహ్మద్​ హుసాముద్దీన్​.. సెమీఫైనల్లోకి ప్రవేశించి పతకం చేజిక్కించుకున్నాడు. పురుషుల 57 కేజీల విభాగంలో జర్మనీ క్రీడాకారునిపై నెగ్గి ఈ ఘనత సాధించాడు.

hyderabad boxer mahmad husamddinn entered into the semi finalas of boxing world cup
‌ప్రపంచకప్‌ సెమీస్‌లోకి ప్రవేశించిన హైదరాబాదీ

ప్రపంచకప్‌ బాక్సింగ్‌ టోర్నీలో హైదరాబాద్‌ కుర్రాడు మహ్మద్‌ హుసాముద్దీన్‌ సత్తా చాటాడు. అద్భుత ప్రదర్శనతో అతను సెమీఫైనల్లో ప్రవేశించి పతకం ఖాయం చేసుకున్నాడు. మహిళల విభాగంలో సిమ్రన్‌జీత్‌ (60 కేజీలు) ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో ఆమె 4-1తో మరియానా (ఉక్రెయిన్‌)ను ఓడించింది. జర్మనీలో జరుగుతున్న ఈ పోటీల్లో శుక్రవారం పురుషుల 57 కేజీల విభాగం క్వార్టర్‌ఫైనల్లో హుసాముద్దీన్‌ 5-0తో ఉమర్‌ బజ్వా (జర్మనీ)ని చిత్తు చేశాడు.

హుసాముద్దీన్‌ దూకుడు ముందు ఉమర్‌ నిలువలేకపోయాడు. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత సతీష్‌కుమార్‌ (91 కేజీలు) కూడా సెమీస్‌ చేరాడు. అతను 5-0తో అలెక్సెల్‌ (మాల్దోవా)ను ఓడించాడు. 57 కేజీల విభాగంలో గౌరవ్‌ సోలంకీ, కవీందర్‌ బిస్త్‌ సెమీస్‌ చేరగా.. ఆశిష్‌ కుమార్‌ (75 కేజీలు) క్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టాడు. అతను 1-3తో మ్యాక్స్‌వాన్‌ (నెదర్లాండ్స్‌) చేతిలో పరాజయం చవిచూశాడు.

ఇదీ చూడండి:బాక్సింగ్​ ప్రపంచకప్​ ఫైనల్లో అమిత్ పంగల్

ABOUT THE AUTHOR

...view details