తెలంగాణ

telangana

ఆ జెర్సీ విలువ సుమారు రూ.14 కోట్లకు పైనే!

By

Published : Nov 29, 2020, 8:19 AM IST

ఫుట్​బాల్​ దిగ్గజం డీగో మారడోనా 'హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌' జెర్సీని అమ్మితే సుమారు రూ. 14.79 కోట్లు వచ్చే అవకాశముందని క్రీడా జ్ఞాపికల నిపుణుడు డేవిడ్​ అమెర్మన్​ అన్నాడు. 1986 ప్రపంచకప్​లో క్వార్టర్స్​ మ్యాచ్​ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్​ ఆటగాడు స్టీవ్​ హాడ్జ్​కు మారడోనా స్వయంగా తన జెర్సీని ఇచ్చారు. మారడోనా జ్ఞాపకంగా ఇప్పుడా జెర్సీని యజమాని వేలం వేయాలనుకుంటున్నట్లు అమెర్మన్ తెలిపాడు.

Diego Maradona's 'Hand of God' shirt could be yours - for $2 million
ఆ జెర్సీ విలువ సుమారు రూ.14 కోట్లకు పైనే!

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా 'హ్యాండ్‌ ఆఫ్‌ గాడ్‌' జెర్సీని అమ్మితే రెండు మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.14.8 కోట్లు) అవకాశముందని అమెరికాకు చెందిన క్రీడా జ్ఞాపికల నిపుణుడు డేవిడ్‌ అమెర్మన్‌ చెప్పాడు. 1986 ప్రపంచకప్‌ క్వార్టర్‌ఫైనల్లో ఇంగ్లాండ్‌పై 'హ్యాండ్‌ ఆఫ్‌ గోల్‌' కొట్టినప్పుడు మారడోనా ఈ షర్ట్‌ను ధరించాడు. అది ఇప్పుడు ఇంగ్లాండ్‌ నేషనల్‌ ఫుట్‌బాల్‌ మ్యూజియంలో ఉంది. మెక్సికో సిటీలో జరిగిన క్వార్టర్‌ఫైనల్‌ ముగిసిన అనంతరం ఇంగ్లాండ్‌ ఆటగాడు స్టీవ్‌ హాడ్జ్‌కు మారడోనా స్వయంగా ఈ జెర్సీని ఇచ్చాడు.

మ్యాచ్‌ ముగిసిన తర్వాత నడుచుకుంటూ వెళ్తునప్పుడు అతడితో తాను జెర్సీని మార్చుకున్నానని హాడ్జ్‌ తెలిపాడు. "ఆ జెర్సీ విలువను అంచనా వేయడం కష్టం. కానీ యజమాని రూ.14.79 కోట్ల (2 మిలియన్‌ డాలర్లు)కు అమ్మడానికి సిద్ధంగా ఉన్నాడని నాకు తెలుసు" అని అమెర్మన్‌ అన్నాడు. ఈ దిగ్గజ ఫుట్​బాలర్​ మారడోనా బుధవారం గుండెపోటుతో మరణించాడు.

ABOUT THE AUTHOR

...view details