తెలంగాణ

telangana

కోహ్లీ ఫామ్​పై ఆందోళన అనవసరం: కపిల్

By

Published : Sep 16, 2021, 3:04 PM IST

టీమ్ఇండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీ ఫామ్​పై అనుమానాలు అక్కర్లేదని తెలిపాడు మాజీ క్రికెటర్ కపిల్ దేవ్(kapil dev on virat kohli captaincy). అతడు ఫామ్​లోకి వస్తే ట్రిపుల్ సెంచరీ చేయగలడని తెలిపాడు.

కోహ్లీ
Virat Kohli

టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఫామ్‌పై మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌(kapil dev on virat kohli captaincy) స్పందించాడు. కెప్టెన్సీ కారణంగానే కోహ్లీ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టలేకపోతున్నాడని వస్తున్న వార్తలను అతడు కొట్టిపారేశాడు. భారత జట్టు పగ్గాలు చేపట్టిన కొత్తలో కోహ్లీ గొప్పగా రాణించి జట్టుకు విజయాలను అందించిన విషయాన్ని గుర్తు చేశాడు. అతడు మునుపటి ఫామ్‌ను అందుకుంటే.. ట్రిపుల్‌ సెంచరీ చేయగలడని పేర్కొన్నాడు.

"కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోహ్లీ భారీ స్కోర్లు నమోదు చేసినప్పుడు ఎవరూ అతడి కెప్టెన్సీ గురించి మాట్లాడలేదు. కొద్దికాలంగా సెంచరీలు(virat kohli last century) బాదలేకపోవడం వల్ల.. కెప్టెన్సీ కారణంగానే కోహ్లీ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టలేకపోతున్నాడని అంటున్నారు. ప్రతి ఒక్కరి కెరీర్లో ఎత్తుపల్లాలుంటాయి. ప్రస్తుతం కోహ్లీలో అద్భుతమైన పరిణతి కనిపిస్తోంది. అతడు మునుపటి ఫామ్‌ను అందుకుంటే.. ట్రిపుల్‌ సెంచరీ బాదగలడు. అతడి ఫిట్‌నెస్‌పై అనుమానాలు అక్కర్లేదు. తన నైపుణ్యాలను మెరుగుపర్చుకుని భారీ స్కోర్లపై దృష్టి సారించాలి" అని కపిల్ దేవ్‌(kapil dev on virat kohli captaincy) సూచించాడు.

దాదాపు రెండేళ్లుగా కోహ్లీ శతకం(virat kohli centuries) నమోదు చేయకపోయినా సగటు మాత్రం మెరుగ్గానే ఉంది. వన్డేల్లో 46.66, టీ20ల్లో 52.60 సగటుతో అతడు కొనసాగుతుండటం విశేషం. కోహ్లీ చివరిసారిగా 2019 నవంబరులో బంగ్లాదేశ్‌(virat kohli last century)తో జరిగిన ఓ మ్యాచులో సెంచరీ బాదాడు. ఈ మధ్యకాలంలో అర్ధ శతకాలు నమోదు చేస్తున్నా.. వాటిని శతకాలుగా మలచడంలో అతడు విఫలమవుతున్నాడు. రానున్న టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో కోహ్లీ మునుపటి ఫామ్‌ అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇవీ చూడండి: టీ20ల్లో బ్రావో సరికొత్త రికార్డు

ABOUT THE AUTHOR

...view details