తెలంగాణ

telangana

'సరైన సమాచారం లేకుండా కెప్టెన్సీ నుంచి తొలగించారు'

By

Published : Dec 15, 2021, 2:20 PM IST

Virat Kohli ODI Captaincy: దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు మీడియాతో మాట్లాడిన టీమ్ఇండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు తనకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని తెలిపాడు.

Virat Kohli ODI captaincy, విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ
Virat Kohli

Virat Kohli ODI Captaincy: తనను వన్డే కెప్టెన్సీ నుంచి బీసీసీఐ ఇటీవల తప్పించిన తర్వాత తొలిసారిగా విరాట్‌ కోహ్లీ మీడియా ముందుకు వచ్చాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అతడు పాల్గొన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే సిరీస్‌కు తాను అందుబాటులో ఉంటున్నట్లు ప్రకటించాడు. అదే విధంగా వన్డేల్లో తనను కెప్టెన్​గా తొలగించడంపైనా స్పందించాడు.

"ఈ నెల 8న టెస్టు జట్టును ప్రకటించే గంటన్నర ముందు సెలెక్టర్లతో నేను ఫోన్​లో మాట్లాడాను. టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు బీసీసీఐకి, నాకు సరైన కమ్యునికేషన్ లేదు. టెస్టు జట్టు ప్రకటించే గంటన్నర ముందు నన్ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు సెలెక్టర్లు చెప్పారు. నేను సరే అన్నా. అలాగే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దని నన్ను ఎవరూ కోరలేదు."

-విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా టెస్టు సారథి ​

దక్షిణాఫ్రికాతో టెస్టు జట్టును ప్రకటించడానికి ముందు వన్టే కెప్టెన్​గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు ప్రకటించింది టీమ్ఇండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ. కోహ్లీ టెస్టులకు సారథిగా కొనసాగుతాడని తెలిపింది. అలాగే టెస్టు వైస్ కెప్టెన్సీ నుంచి రహానేను తొలగిస్తూ.. రోహిత్​కు ఆ బాధ్యతలు అప్పగించారు. అయితే ఇప్పటివరకు కోహ్లీకి తెలిసే ఇదంతా జరిగిందని అభిమానులు భావించారు. కానీ తాజాగా విరాట్ మాట్లాడిన ప్రకారం చూస్తే.. అతడికి ఈ విషయంపై ముందస్తు సమాచారం అందించలేదని తెలుస్తోంది. ​​

ఇవీ చూడండి: 'సౌతాఫ్రికాతో వన్డే సిరీస్​లో ఆడతా.. రోహిత్​తో ఎలాంటి గొడవలు లేవు'

ABOUT THE AUTHOR

...view details