Virat Kohli 50th ODI Century :టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డేల్లో కొత్త చరిత్ర సృష్టించాడు. కెరీర్లో 50వ వన్డే సెంచరీ నమోదు చేశాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీస్ మ్యాచ్‌లో అతడు ఈ ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు సచిన్ (49)ను అధిమించాడు. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచాడు విరాట్. ఇక సెంచరీ అనంతరం స్టాండ్స్‌లో ఉన్న సచిన్‌కు అభివాదం చేశాడు విరాట్. ఇక 117 వ్యక్తిగత స్కోర్ వద్ద విరాట్.. భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచౌట్‌గా పెవిలియన్ చేరాడు. విరాట్ ఈ మైలురాయి అందుకోవడం పట్ల పలువురు మాజీలు, సెలెబ్రిటీలు అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో విరాట్ అందుకున్న మరికొన్ని ఘనతలు.
- సింగిల్ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్‌గా విరాట్ (711) రికార్డుకొట్టాడు. ఈ క్రమంలో విరాట్.. సచిన్ (673)ను అధిగమించాడు.
- విరాట్ ఈ ప్రపంచకప్‌లో 8 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ క్రమంలో ఒకే వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ఎక్కువ హాఫ్ సెంచరీలు బాదిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇదివరకు ఈ రికార్డు సచిన్ (7) పేరిట ఉండేది.
- ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ వన్డే కెరీర్లో 13794 పరుగులు చేశాడు. దీంతో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ లిస్ట్‌లో సచిన్ (18426), కుమార సంగక్కర (14234) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.
- ఈ వరల్డ్‌కప్‌లో విరాట్ కోహ్లీకి ఇది 3వ సెంచరీ. ఓవరాల్‌గా ప్రపంచకప్‌లో 5వ శతకం.
వన్డేల్లో అత్యధిక సెంచరీలు
- విరాట్ కోహ్లీ (భారత్) - 50
- సచిన్ తెందూల్కర్ (భారత్) - 49
- రోహిత్ శర్మ (భారత్) - 31
- రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 30
- సనత్ జయసూర్య (శ్రీలంక) - 28