తెలంగాణ

telangana

'నన్ను ఫిక్సర్ అంటూ పిలిచాడు, వాళ్లు అతడ్ని సేవ్ చేయాలని చూస్తున్నారు' గంభీర్​తో గొడవపై శ్రీశాంత్ క్లారిటీ

By ETV Bharat Telugu Team

Published : Dec 7, 2023, 3:58 PM IST

Updated : Dec 7, 2023, 4:10 PM IST

Sreesanth vs Gambhir : 2023 లెజండ్స్ ప్రీమియర్ లీగ్​లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్​లో, టీమ్ఇండియా ప్లేయర్లు శ్రీశాంత్ - గంభీర్ మధ్య వాగ్వాదం జరిగింది.

sreesanth vs gambhir
sreesanth vs gambhir

Sreesanth vs Gambhir : టీమ్ఇండియ మాజీ ప్లేయర్లు గౌతమ్ గంభీర్ - శ్రీశాంత్ మధ్య తాజాగా చిన్నపాటి వాగ్వాదం జరిగింది. 2023 లెజెండ్స్​ ప్రీమియర్ లీగ్​లో భాగంగా ఇండియా క్యాపిటల్స్ - గుజరాత్ జెయింట్స్ మధ్య బుధవారం మ్యాచ్ జరిగింది. ఈ లీగ్​లో ఇండియా క్యాపిటల్స్​ జట్టుకు గంభీర్ కెప్టెన్ కాగా, శ్రీశాంత్ గుజరాత్​కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఈ మ్యాచ్​ రెండో ఓవర్​లో శ్రీశాంత్ బౌలింగ్​లో గంభీర్, వరుసగా సిక్స్​, ఫోర్ కొట్టి ఊపుమీదున్నాడు. ఈ క్రమంలో శ్రీశాంత్, గంభీర్ వైపు అదోలా చూశాడు. దీంతో గంభీర్ ఏ మాత్రం తగ్గకుండా ఏంటి అన్నట్లుగా శ్రీశాంత్​ను చూశాడు. దీంతో మైదానంలోనే ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇంతలో ఫీల్డ్ అంపైర్లు కలగజేసుకొని ఇద్దరికి నచ్చజెప్పారు.

అయితే తాజాగా శ్రీశాంత్, సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్​ చేశాడు. గ్రౌండ్​లో గంభీర్​తో జరిగిన గొడవ గురించి ఈ వీడియోలో చెప్పాడు. "మైదానంలో గంభీర్​ నన్ను 'ఫిక్సర్', 'ఫిక్సర్' అని అన్నాడు. నేను నవ్వుతూ ఏమన్నావ్? అని అడిగా అంతే. మళ్లీ తను అలాగే అన్నాడు. మధ్యలో వచ్చిన అంపైర్లతో కూడా పరుష పదజాలాన్ని ఉపయోగిస్తూ మాట్లాడాడు. నేను అతడిని ఒక్క మాట అనలేదు. చెడుగా ప్రవర్తించలేదు. అయితే అతడు 'సిక్సర్' అని అంటే నేను 'ఫిక్సర్' అని ప్రచారం చేస్తున్నానంటూ, అతడి మద్దతుదారులు అతడ్నికాపాడాలని చూస్తున్నారు. ఇది సరైన పద్దతి కాదు. ప్రజలు నిజాన్ని గమణించాలి" అని శ్రీశాంత్ అన్నాడు. ఇక గంభీర్​ను తాను రెచ్చగొట్టకపోయినా, అతడే తనతో గొడవ పడ్డాడని అన్నాడు. అలాగే గంభీర్ సీనియర్లకు మర్యాద ఇవ్వడని బుధవారం మ్యాచ్ అనంతరం పోస్ట్ చేసిన వీడియోలో శ్రీశాంత్ చెప్పాడు.

ఇదిలా ఉండగా, గంభీర్ తాజాగా ట్విట్టర్​లో ఓ పోస్ట్ చేశాడు. టీమ్ఇండియా జెర్సీ ధరించి ఉన్న అతడి ఫొటోను షేర్ చేస్తూ, 'ప్రపంచమంతా అటెన్షన్​గా ఉన్నప్పుడు నవ్వాలి' అనే క్యాప్షన్ రాసుకొచ్చాడు. దీనికి మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించి 'నవ్వు సరైన సమాధానం బ్రదర్' అని కామెంట్ చేశాడు.

మాజీ క్రికెటర్ శ్రీశాంత్​పై ఛీటింగ్​ కేసు! - రూ. 18.70 లక్షలు మోసగించారని!

లఖ్​నవూకు గంభీర్​ గుడ్​బై - మళ్లీ కోల్​కతాతో జర్నీ స్టార్ట్

Last Updated :Dec 7, 2023, 4:10 PM IST

ABOUT THE AUTHOR

...view details