తెలంగాణ

telangana

స్మృతి కీలక నిర్ణయం.. బిగ్​బాష్​ లీగ్​కు దూరం

By

Published : Sep 13, 2022, 5:41 PM IST

womens big bash league 2022

భారత మహిళల క్రికెట్​ జట్టు వైస్​ కెప్టెన్​ స్మృతి మంధాన.. ఆస్ట్రేలియాలో జరగబోయే బిగ్​బాష్ లీగ్​కు దూరంగా ఉండాలని భావిస్తోంది. గత ఫిబ్రవరి నుంచి గ్యాప్​ లేకుండా ఆడటమే ఇందుకు కారణం. ఈ విషయంపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

భారత మహిళల జట్టు క్రికెటర్​ స్మృతి మంధాన.. 2022 ఫిబ్రవరి నుంచి విరామం లేకుండా మ్యాచ్​లు ఆడుతోంది. ఫిబ్రవరిలో ఇండియా-న్యూజిలాండ్​​ ద్వైపాక్షిక టోర్నమెంట్​లో, ఆ తర్వాత వన్డే వరల్డ్​ కప్​లో ఆడింది. అనంతరం కామన్​వెల్త్​ గేమ్స్​లోనూ పాల్గొంది. మళ్లీ ఇప్పుడు ఇంగ్లాండ్​తో ద్వైపాక్షిక సిరీస్​ ఆడుతోంది. అయితే.. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 టోర్నమెంట్​ బిగ్​బాష్​ లీగ్​ నుంచి ఆమె తప్పుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని స్వయంగా స్మృతి మంధాన వెల్లడించింది.

"మానసికంగా కాకున్నా.. ఫిజికల్​గా ఒత్తిడి లేకుండా మేనేజ్​ చేసుకోవడం కూడా ముఖ్యమే. బిగ్​బాష్ లీగ్​ నుంచి బయటకు రావాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను భారత జట్టు ఆడే అంతర్జాతీయ మ్యాచ్​లు మిస్​ కాదలచుకోలేదు. నేను భారత జట్టు తరఫున ఆడినపుడు.. నా నుంచి 100 శాతం ప్రదర్శన ఇవ్వాలనుకుంటాను" అని చెప్పుకొచ్చింది.

అయితే బిగ్​బాష్ లీగ్ అక్టోబర్ 13న ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ నవంబర్​ చివరి వరకు సాగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఇంగ్లాడ్​​ సిరీస్​ ఈ నెల 24న ముగియనుంది. దాని తర్వాత అక్టోబర్ 1 నుంచి 16 వరకు జరగనున్న ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్​కు వెళ్లనుంది. ఆ తర్వాత డిసెంబర్, జవవరి, ఫిబ్రవరి దాకా భారత్​కు వివిధ టోర్నమెంట్​లు ఉన్నాయి. అయితే ఈ బిగ్​బాష్​ డొమెస్టిక్​ టోర్నమెంట్ ఆడితే తనపై మరింత ఒత్తిడి పెరుగుతుందని​ చెబుతోంది స్మృతి. దానికోసం బిగ్​బాష్​ లీగ్ నుంచి విశ్రాంతి తీసుకోవాలని స్మృతి మంధాన భావిస్తోంది. అలా అయితే.. తర్వాత జరగనున్న వరుస మ్యాచ్​ల్లో తనపై భారం తగ్గుతుందని ఆమె అనుకుంటోంది.

ఇవీ చదవండి:పాక్​బౌలర్​తో రిలేషన్​.. పంత్​కు క్షమాపణ చెప్పిన ఊర్వశి రౌతేలా

టీ20 ప్రపంచకప్​ జట్టుపై మాజీల విశ్లేషణ.. ఏం అంటున్నారంటే?

ABOUT THE AUTHOR

...view details