తెలంగాణ

telangana

Shoaib Akhtar On India Pakistan Match : బాబర్​ సేనపై అక్తర్ విమర్శలు.. ఈ సారి వర్షమే పాక్‌ను రక్షించిందంటూ..

By ETV Bharat Telugu Team

Published : Sep 11, 2023, 2:16 PM IST

Shoaib Akhtar On India Pakistan Match : పాకిస్థాన్​ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ విమర్శలు గుప్పించాడు. వరుణుడే భారత్​-పాకిస్థాన్​ మధ్య జరిగిన సూపర్​-4 మ్యాచ్​లో పాక్​ను ఓటమి నుంచి రక్షించాడని అన్నాడు. ఇంకా అక్తర్ ఏమన్నాడంటే?

shoaib akhtar on india pakistan match
shoaib akhtar on india pakistan match

Shoaib Akhtar On India Pakistan Match :భారత్​-పాకిస్థాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రియులకు నరాల తెగే ఉత్కంఠ ఉంటుంది. చిరకాల ప్రత్యర్థులైన భారత్‌-పాక్‌ మధ్య ఆసియా కప్‌ సూపర్‌-4 మ్యాచ్‌కు ఆదివారం వర్షం ఆటంకం కలిగించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే ఉండటం వల్ల ఎక్కడైతే ఆట నిలిచిందో అక్కడి నుంచి సోమవారం మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో పాక్‌ పేస్‌ దళాన్ని టీమ్​ఇండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ సమర్థంగా ఎదుర్కొని జట్టుకు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో పాక్ ఆటతీరుపై ఆ జట్టు మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. పాక్ జట్టుపై విమర్శలు చేశాడు.

లీగ్‌ స్టేజ్‌లో వర్షం భారత్‌కు అనుకూలంగా మారితే.. సూపర్‌ 4 మ్యాచ్‌లో భారత బ్యాటింగ్‌ దాడి నుంచి వరుణుడు పాక్‌ను రక్షించాడని అక్తర్‌ అన్నాడు.'నేను భారత్​-పాక్​ మ్యాచ్ చూసేందుకు శ్రీలంక వెళ్లాను. ఇరుదేశాల అభిమానులంతా మ్యాచ్ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇంతకు మందు మ్యాచ్‌లో వరుణుడు భారత్‌ను కాపాడాడు. ఆదివారం పడిన వర్షం పాకిస్థాన్​ను రక్షించింది.' అని అక్తర్‌ ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా ఓ వేడియోను షేర్ చేశాడు.

దాయాదుల మధ్య జరిగిన లీగ్‌ పోరులోమాదిరిగా.. ఈ మ్యాచ్‌లో పాక్‌ పేసర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. భారత ఓపెనర్లు వారిని అలవోకగా ఎదుర్కొని పరుగుల వరద పారించారు. ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌ (58), రోహిత్‌ శర్మ (56) జట్టుకు అదిరే ఆరంభాన్నివ్వగా.. విరాట్‌ కోహ్లి (8), కేఎల్‌ రాహుల్‌ (17) క్రీజులో ఉన్నారు. వర్షం పడే సమయానికి భారత్‌ 24.1 ఓవర్లలో 147/2తో ఉంది.

'షహీన్‌ అఫ్రిది బౌలింగ్ పేలవం'
భారత్​తో జరిగిన మ్యాచ్‌లో పాక్‌ బౌలర్లలో షహీన్‌ అఫ్రిది తీరు పేలవంగా ఉందని ఆ దేశ మాజీ సీమర్‌ వకార్‌ యూనిస్‌ తెలిపారు. 'కొత్త బంతితో షహీన్‌ నిరాశపర్చాడు. పాక్‌ జట్టులో ఏ బౌలరు షార్ట్‌బాల్స్‌, బౌన్సర్లకు ప్రయత్నించలేదు. మరో ఎండ్‌ నుంచి నసీమ్‌ స్వింగ్‌ను రాబట్టాడు. అదే మీరు సరైన ప్రదేశాల్లో బంతిని సంధిస్తే బ్యాటర్లను కచ్చితంగా ఇబ్బంది పెట్టేవారు. షహీన్‌ అఫ్రిది గత మ్యాచ్‌లో బాగా ఆలోచించి బౌలింగ్‌ చేశాడు. దీంతో అద్భుతమైన 10 ఓవర్లు లభించాయి. కానీ, ఈ మ్యాచ్‌లో మాత్రం కొత్త బంతితో పేలవంగా బౌలింగ్‌ చేసి బౌండరీలు సమర్పించుకొన్నాడు' అని అభిప్రాయపడ్డాడు.

Asia Cup 2023 Ind vs Pak : 'ఓ మై గాడ్'.. అలా జరిగితే టీమ్ఇండియాకు కష్టమే!

Asia Cup 2023 Ind vs Pak Reserve Day Weather : రిజర్వ్ డే రోజూ అదే పరిస్థితి! మ్యాచ్ రద్దయ్యే ఛాన్స్?

New Zealand World Cup Squad 2023 : వరల్డ్​కప్​నకు కివీస్ జట్టు ప్రకటన.. కేన్​ మామ వచ్చేశాడుగా..

ABOUT THE AUTHOR

...view details