తెలంగాణ

telangana

Sehwag birthday: బ్యాట్​తో బౌండరీలు.. ట్విట్టర్​లో పంచులు..!

By

Published : Oct 20, 2021, 9:24 AM IST

sehwag birthday
వీరేంద్ర సెహ్వాగ్ పుట్టినరోజు

టీమ్​ఇండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. బ్యాటింగ్​ చేసినంత సులభంగా ట్వీట్స్​ చేస్తూ, అభిమానుల్ని ఆకట్టుకుంటున్నాడు. బుధవారం అతడి పుట్టినరోజు సందర్భంగా (sehwag birthday) వీరూ పంచింగ్ ట్వీట్స్​తో పాటు అతడి నెలకొల్పిన రికార్డుల గురించి ప్రత్యేక కథనం.

ఏ బ్యాట్స్​మెన్​ అయినా క్రీజులో దిగగానే డిఫెన్స్ ఆడాలని చూస్తాడు. అయితే వచ్చి రాగానే బంతిని బౌండరీ దాటించాడంటే అర్థం చేసుకోవచ్చు.. అక్కడున్నది వీరేంద్ర సెహ్వాగ్​ అని.​ తన ఆటతో కోట్లాది మంది భారతీయులకు ఆరాధ్యుడిగా మారాడు. బ్యాట్‌తో బౌండరీ బాదినంత తేలిగ్గా ట్విటర్‌లో పంచులు విసురుతూ ఆ అభిమానాన్ని మరింత పెంచుకున్నాడు. వీరూ పుట్టినరోజు (sehwag birthday) సందర్భంగా అతడి పంచింగ్‌ ట్వీట్లపై ప్రత్యేక కథనం.

ట్రిపుల్‌ సెంచరీలు చేసింది నేను కాదు.. నా బ్యాట్..!

'నేను రెండు ట్రిపుల్‌ సెంచరీలు చేయలేదు. నా బ్యాట్‌ చేసింది'.. 'క్రికెట్‌ను కనిపెట్టిన ఇంగ్లాండ్‌ ప్రపంచకప్‌ (sehwag birthday special) గెలవలేదు. అయినా ఆ మెగాటోర్నీల్లో ఆడుతోంది'.. 'కబడ్డీ కనిపెట్టిన భారత్‌ ఎనిమిదోసారి (sehwag records in cricket) ప్రపంచ ఛాంపియన్‌ అయింది. క్రికెట్‌ని కనిపెట్టిన దేశం, ఇంకా ఇతరుల తప్పులను వెతుకుతోంది'.. ఇవి వీరేంద్రుడు గతంలో చేసిన కొన్ని పంచ్‌ ట్వీట్లు. 2016 రియో ఒలింపిక్స్‌ సందర్భంగా భారత అథ్లెట్లు రెండు పతకాలే సాధించినా వారికి ఇక్కడ ఘన స్వాగతం పలికారు అభిమానులు. పీర్స్‌ మోర్గాన్‌ అనే ఇంగ్లిష్‌ జర్నలిస్టు ఆ ఫొటోలను పోస్టు చేస్తూ.. '1.2 బిలియన్ల జనాభా ఉన్న దేశం. రెండు పతకాలకే సంబరాలు చేసుకుంటుంది, సిగ్గుగా అనిపించడం లేదా?' అని ట్వీట్ చేశాడు. సెహ్వాగ్‌ అదే రీతిలో కౌంటర్‌ ఇచ్చాడు. 'చిన్నచిన్న విషయాలనే మేం పెద్దవిగా ఆస్వాదిస్తాం. కానీ, క్రికెట్‌ను కనిపెట్టిన ఇంగ్లాండ్‌ ఇంకా ప్రపంచకప్‌ గెలవాల్సి ఉంది. అయినా ప్రపంచకప్‌ ఈవెంట్లు ఆడుతోంది. సిగ్గుగా లేదా?' అని అప్పట్లో ప్రశ్నించాడు.

టీమిండియా మాజీ క్రికెటర్ వీరంద్ర సెహ్వాగ్

ట్విట్టర్​తో వినూత్నంగా ఆదాయం

'ఏదైనా అత్యుత్తమ నైపుణ్యం ఉంటే.. దాన్ని ఉచితంగా చేయకు' అనే సామెత. టీమ్​ఇండియా మాజీ ఓపెనర్​కి ఇది సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే అతడికున్న నైపుణ్యంతో సామాజిక మాధ్యమాల్లో ఏ బ్రాండ్‌కూ ప్రచారం చేయకుండా లక్షల్లో గడిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించాడీ మాజీ క్రికెటర్. 'ట్విటర్‌ ద్వారా సుమారు రూ.30లక్షల ఆదాయం సంపాదించా. అది కూడా ఆరు నెలల్లోనే' అని ఓ ట్వీట్‌లో చెప్పుకొచ్చాడు.

సెహ్వాగ్‌ సరదా ట్వీట్లు:

  • అశ్విన్‌ ఏడోసారి మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ గెలిచిన సందర్భంలో అతడికి అభినందనలు (sehwag funny tweets) తెలుపుతూ 'త్వరగా ఇంటికి చేరుకోవాలనే విషయం వివాహితుడికి మాత్రమే అర్థం అవుతుంది' అని సరదాగా వ్యాఖ్యానించాడు.
  • క్రికెట్‌ లెజెండ్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ జన్మదినం సందర్భంగా మూడు వేర్వేరు ఫొటోలను జతచేశాడు. అందులో ఒకటి డాన్ ఫొటో‌, రెండోది బ్రెడ్‌, మూడోది ఒక వ్యక్తి. ఇలా మూడు ఫొటోలతో డాన్‌బ్రాడ్‌మన్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.
  • ప్రముఖ నటుడు వినోద్‌ ఖన్నా జన్మదినం సందర్భంగా ఈరోజు మనమంతా గన్నా(చెరుకు) జూస్‌ తాగి వినోద్‌ ఖన్నాకు శుభాకాంక్షలు తెలుపుదాం అన్నాడు.
  • ఓ సారి విరాట్‌ కోహ్లీని పొగుడుతూ 'హజ్మేకి గోలీ, రంగోంకి హోలి, బ్యాటింగ్‌ మె కోహ్లీ.. యావత్‌ భారత్‌ ఇష్టపడుతుందని' ట్వీట్‌ చేశాడు.
  • ఈ రోజుల్లో కళ్లు మూసుకున్నా, టెన్షన్‌ లేకున్నా నిద్రరాదు. వైఫై బంద్‌ చేస్తేనే నిద్రవస్తుందని జోక్‌ పేల్చాడు.
  • ప్రముఖ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌ను కొనియాడుతూ 'ఆమె పేరు సెరెనా, అయినా టైటిల్స్‌ గెలవడంలో 'నా' చెప్పదు. గెలుస్తూనే ఉంటుందని ట్వీట్ చేశాడు
    టీమిండియా మాజీ క్రికెటర్ వీరంద్ర సెహ్వాగ్

వీరూ సాధించిన రికార్డ్​లు:

  • టెస్టులు, వన్డేల్లో కలిపి మొత్తం (sehwag records) 7500 రన్స్ సాధించిన ఏకైక ఓపెనర్​గా ఘనత ఉంది.
  • అరంగ్రేటంలోనే విదేశీ గడ్డపై టెస్టుల్లో సెంచరీ బాదిన ఆరవ ఆడగాడు.
  • టెస్ట్​ల్లో 300 పరుగులు చేసిన తొలి బ్యాట్స్​మెన్​.
  • 28 మ్యాచ్​ల్లో ఇన్నిగ్స్ మొదటి బంతిని సిక్స్​/ఫోర్​తో ప్రారంభించాడు.
  • కెప్టెన్​గా వన్డేల్లో 219 పరుగులు సాధించిన ఘనత మన వీరూదే.
  • టెస్టుల్లో ఒకే ఇన్నింగ్స్​లో అత్యంత వేగంగా (278 బంతుల్లో) 300 మార్క్​ను దాటిన తొలి ఆటగాడు.

ఇదీ చదవండి:T20 world cup 2021: అవసరమైతే జట్టు నుంచి తప్పుకొంటా: కెప్టెన్ మోర్గాన్

ABOUT THE AUTHOR

...view details