తెలంగాణ

telangana

సచిన్​పై ఫ్యాన్స్ సెటైర్లు​​..​ ఎందుకయ్యా ఇలా చేశావంటూ

By

Published : Sep 14, 2022, 10:28 AM IST

టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్​ సచిన్‌ తెందుల్కర్​పై ఫ్యాన్స్​ సైటైర్లు వేస్తున్నారు. ఎందుకలా చేశావంటూ విపరీతంగా కామెంట్లు పెడుతున్నారు. ఇంతకీ క్రికెట్​ దిగ్గజం ఏం చేశాడంటే..

sachin
సచిన్​పై ఫ్యాన్స్​

టీమ్​ఇండియా దిగ్గజ క్రికెటర్​ సచిన్‌ తెందుల్కర్​.. సోషల్​మీడియాలో చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడూ తనకు సంబంధించిన విషయాలతో పాటు క్రికెట్​కు సంబంధించిన సూచనలు ఇస్తుంటారు. అయితే తాజాగా ఆయన.. ఓ వీడియోను ఇన్​స్టాలో పోస్ట్ చేశారు. అందులో బ్యాట్​ హ్యాండిల్​, గ్రిప్​ను ఎలా శుభ్రపరచుకోవాలో చూపించాడు. ''ఇలాంటి చిన్న విషయాలు ఎవరు చెప్పరు'' అంటూ వీడియోకు క్యాప్షన్‌ జత చేశాడు. ఈ ప్రక్రియ అంతా బాగానే ఉన్నప్పటికీ క్రికెట్‌ ఫ్యాన్స్‌ మాత్రం సచిన్‌ను ఒక విషయంలో తప్పుబట్టారు.

అదేంటంటే.. బ్యాట్‌ను క్లీన్‌ చేసే క్రమంలో సచిన్​ నీటిని చాలా వరకు వృథా చేశారంటూ.. అవసరం ఉన్నప్పుడు ట్యాప్‌ తిప్పితే సరిపోయేదని.. కానీ సచిన్‌ అలా చేయకుండా వీడియోలో మాట్లాడుతున్నంత సేపు కుళాయిలో నీరు వృథాగా పోతూనే ఉందని కామెంట్లు విపరీతంగా పెట్టారు. మరోవైపు.. సచిన్​ ప్రస్తుతం ముంబయిలో 'సేవ్‌ వాటర్‌' క్యాంపెయిన్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే సచిన్​ పోస్ట్ చేసిన ఈ వీడియో మరింత వైరల్​గా మారింది. 'సచిన్‌ సార్‌.. మీరు చెప్పాలనుకున్న విషయం మంచిదే కావొచ్చు.. కానీ ఇలా నీరును వృథా చేయడం బాగోలేదు', 'సార్‌.. నీటిని రక్షించాలన్న మీ మాటలు మరిచిపోయారా.. ముంబయి సివిక్‌ బాడీ సేవ్‌ వాటర్ క్యాంపెయిన్‌కు మీరు బ్రాండ్‌ అంబాసిడర్‌ అన్న సంగతి గుర్తుంది కదా'' అంటూ కామెంట్లు చేశారు.

కాగా, ఇండియా లెజెండ్స్‌కు నాయకత్వం వహిస్తున్న సచిన్‌.. ఇటీవలే సౌతాఫ్రికా లెజెండ్స్‌తో మ్యాచ్‌లో 16 పరుగులు చేసి ఔటయ్యాడు. స్టువర్ట్‌ బిన్నీ విధ్వంసంతో ఇండియా లెజెండ్స్‌ తమ తొలి మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

ఇదీ చూడండి: టెన్నిస్​ రాకెట్​తో అదరగొడుతున్న యువతరం.. భవిష్యత్​ ఆ కుర్రాళ్లదే!

ABOUT THE AUTHOR

...view details