తెలంగాణ

telangana

కోహ్లీ అవసరం జట్టుకు ఎంతో ఉంది: రోహిత్ శర్మ

By

Published : Dec 9, 2021, 6:11 PM IST

Rohit Sharma ODI Captain: టీమ్​ఇండియా వన్డే సారథి రోహిత్​ శర్మ.. తన భార్య రితికను పొగుడుతూ పలు వ్యాఖ్యలు చేశాడు. మొదటి నుంచి రితిక తనకు అండగా నిలిచిందని అన్నాడు. మాజీ సారథి విరాట్​ కోహ్లీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశాడు రోహిత్. జట్టుకు కోహ్లీ అవసరం ఎంతో ఉందని గుర్తుచేశాడు.

rohit, virat
రోహిత్ శర్మ-రితిక, విరాట్ కోహ్లీ

Rohit Sharma ODI Captain: టీమ్​ఇండియా వన్డే జట్టుకు కెప్టెన్​గా రోహిత్ శర్మను నియమిస్తూ భారత క్రికెట్ నియంత్రణ మండలి బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే.. అభిమానులు ఊహించని ఈ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో కొత్త కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తన భార్య రితికపై, టీమ్​ఇండియా మాజీ సారథి విరాట్​ కోహ్లీపై కీలక వ్యాఖ్యలు చేశాడు.

రితికా వల్లే..

Rohit Sharma on Ritika: టీమ్​ఇండియా టీ20, వన్డే సారథి రోహిత్ శర్మ.. తన సతీమణి రితికను పొగడ్తలతో ముంచెత్తాడు. మొదటి నుంచి తనకు మద్దతుగా నిలుస్తూ వచ్చింది రితిక అని చెప్పాడు.​ కఠిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా తన పక్కనే ఉండి.. క్రికెటర్​గా ఎదగడానికి ఎంతో సహకరించిందని రోహిత్ చెప్పుకొచ్చాడు. బ్యాక్​స్టేజ్ విత్ బోరియా కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు రోహిత్.

" రితిక.. నా నంబర్ 1 సపోర్ట్​ సిస్టమ్. అందులో సందేహమే లేదు. ఇన్నేళ్లుగా నా పక్కనే రాయిలా నిలుచుని ఉంది. ముందు చూసినా, వెనకు చూసినా ఎక్కడ చూసినా తనే కనిపిస్తుంది."

--రోహిత్ శర్మ, టీమ్​ఇండియా కెప్టెన్.

తను క్రికెట్​పై ధ్యాస పెట్టేలా రితిక ఎంతో సహకరించిందని, ఇంటి పనులు కూడా తనే చూసుకునేదని రోహిత్ చెప్పుకొచ్చాడు.

విరాట్ చాలా అవసరం..

Rohit Sharma comments on Virat Kohli: విరాట్ కోహ్లీపై టీమ్‌ఇండియా కొత్త సారథి రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ వంటి నాణ్యమైన బ్యాటర్ జట్టులో ఉండటం ఎంతో ముఖ్యమని పేర్కొన్నాడు. అతని అనుభవం జట్టుకు చాలా అవసరమని, కష్ట సమయాల్లో తన అద్భుత ఆటతీరుతో జట్టుని ఆదుకున్నాడని వివరించాడు. టీ20ల్లో 50కి పైగా సగటు ఉండటం అత్యంత అరుదని హిట్‌మ్యాన్ వెల్లడించాడు.

'విరాట్‌ కోహ్లీ వంటి నాణ్యమైన బ్యాటర్‌ జట్టుకెప్పటికీ అవసరం. టీ20 ఫార్మాట్‌లో 50 పరుగుల కంటే ఎక్కువ సగటు ఉండటం అంత సులభం కాదు. నిజంగా ఇది క్రేజీ! తన అనుభవంతో జట్టును ఎన్నోసార్లు కష్టాల్లో గట్టెక్కించాడు. అతడిలోని నాణ్యత, బ్యాట్స్‌మన్‌షిప్‌ చాలా అవసరం. అతనిప్పటికీ నాయకుడే. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని అతడు దూరం కావాలని ఎవరూ కోరుకోరు. అతడిని ఎవరూ విస్మరించరు. అతడి ఉనికి జట్టుకెంతో అవసరం'

--రోహిత్ శర్మ, కెప్టెన్.

పని ఒత్తిడి కారణంగా టీ20ల్లో కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొంటానని ఇటీవల ముగిసిన పొట్టి ప్రపంచకప్‌కు ముందు విరాట్ కోహ్లీ ప్రకటించాడు. దీంతో ఆ బాధ్యతలను ఓపెనర్‌ రోహిత్ శర్మకు అప్పగించింది బీసీసీఐ. తాజాగా వన్డే కెప్టెన్సీ పగ్గాలను సైతం హిట్‌మ్యాన్‌కే అప్పగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీని వన్డే సారథిగానూ తప్పుకోవాలని సెలక్టర్లు సూచిస్తూ రెండు రోజులు గడువు ఇవ్వగా.. అతడి నుంచి స్పందన లేకపోవడం వల్ల నిర్మొహమాటంగా వేటు వేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం డిసెంబర్​లో దక్షిణాఫ్రికా పర్యటనపై రోహిత్​ దృష్టి సారిస్తున్నాడు. డిసెంబర్ 26 దక్షిణాఫ్రికా, భారత్ మధ్య సిరీస్​ ప్రారంభం కానుంది. ఇరు జట్లు మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్నాయి.

ఇదీ చదవండి:

ఇక మిగిలింది టెస్టు కెప్టెన్సీనే.. కోహ్లీ మెడపై మరో కత్తి!

కెప్టెన్​గా కోహ్లీ తొలగింపు.. బీసీసీఐపై అభిమానుల ఆగ్రహం

ABOUT THE AUTHOR

...view details