తెలంగాణ

telangana

MI పై రోహిత్ ఎఫెక్ట్!- గంటలో 4లక్షల మంది అన్​ఫాలో- సూర్య హార్ట్​ బ్రేక్ స్టోరీ

By ETV Bharat Telugu Team

Published : Dec 16, 2023, 11:01 AM IST

Updated : Dec 16, 2023, 11:49 AM IST

Rohit Effect On MI Instagram Account : ముంబయి ఫ్రాంచైజీ ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యను కెప్టెన్​గా ప్రకటించిన తర్వాత, గంటల వ్యవధిలోనే ఎమ్​ఐ (MI) సోషల్ మీడియాలో 4 లక్షల ఫాలోవర్లను కోల్పోయింది. ఈ నిర్ణయాన్ని రోహిత్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వ్యతిరేకిస్తున్నారు.

Rohit Effect On MI Instagram Account
Rohit Effect On MI Instagram Account

Rohit Effect On MI Instagram Account : ముంబయి ఇండియన్స్​ ​కెప్టెన్ బాధ్యతల నుంచి రోహిత్​ శర్మను తప్పించడం, హిట్​మ్యాన్​ ఫ్యాన్స్​తోపాటు, ఎమ్​ఐ (MI) అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో రాత్రికి రాత్రే దాదాపు 4 లక్షల మంది రోహిత్ ఫ్యాన్స్, ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) అధికారిక సోషల్ మీడియా అకౌంట్​ను అన్​ఫాలో కొట్టేశారు. ​అయితే ఫ్రాంచైజీ, రోహిత్​తో సంప్రదించే ఇంత పెద్ద నిర్ణయం తీసుకొని ఉంటుందని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ జట్టుకు 5 టైటిళ్లు అందించిన సక్సెస్​ఫుల్ కెప్టెన్​కు దక్కాల్సిన గౌరవం ఇది కాదంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అసహనం వ్యక్తపరుస్తున్నారు. వారు ఫ్రాంచైజీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాగా, తాజా పరిణామంతో చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో అత్యధిక ఫాలోవర్లు కలిగిన ఫ్రాంచైజీగా నిలిచింది. ఇంతకాలం ముంబయి టాప్​లో ఉండేది.

మరోవైపు హార్దిక్​ పాండ్యను కెప్టెన్​గా ప్రకటించిన తర్వాత ముంబయి ఇండియన్స్, తమ అధికారిక సోషల్ మీడియా అకౌంట్​లో రోహిత్​కు సానుకూలంగా ఓ వీడియో పోస్ట్ చేసింది. '2013లో నువ్వు నాయకత్వ బాధ్యతలు తీసుకొని నాపై నమ్మకం ఉంచమని కోరావు. గెలుపు, ఓటముల్లో ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలన్నావు. ఈ పదేళ్లలో ఆరు టోఫ్రీలు (5 ఐపీఎల్​, 1 ఛాంపియన్స్​ లీగ్) అందించావు. ఎప్పటికీ నువ్వు మా కెప్టెన్​వే. ముంబయి ఇండియన్స్ ​పై నీ ముద్ర చెరగనిది. థాంక్యూ, కెప్టెన్ రోహిత్. ముంబయి కా రాజా' అంటూ ఎమోషనల్​గా రాసుకొచ్చింది.

సూర్య హార్ట్ బ్రేక్ :ఇదిలా ఉండగా టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ తాజాగా 'హార్ట్ బ్రేక్' ఇమేజ్ ఇన్​స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. రోహిత్​ను కెప్టెన్సీ నుంచి తప్పించినందుకే సూర్య ఇలా రియాక్ట్ అయ్యాడని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, గతనెల హార్దిక్​ను ముంబయి ట్రేడ్ చేసుకున్నాక జస్ప్రీత్ బుమ్రా 'సైలెన్స్' అని ఇన్​స్టా స్టోరీ పోస్ట్ చేశాడు. బహుషా ఇలా జరుగుతుందని బుమ్రా అప్పుడే ఊహించాడా అని చర్చ నడుస్తోంది.

ఓ శకం ముగిసింది !: ముంబయి నిర్ణయం పట్ల ఫ్యాన్స్ తీవ్ర అంసతృప్తి వ్యక్తపరుస్తున్నారు. 'నేను ముంబయి ఫ్యాన్​గా రిటైరయ్యాను' అని ఓ నెటిజన్ అనగా, 'ఇది అస్సలు ఊహించలేనిది' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ఇక ఐపీఎల్​ హిస్టరీలో రోహిత్ అనే సక్సెస్​ఫుల్​ కెప్టెన్ శకం ముగిందని ఓ ఫ్యాన్ పోస్ట్ చేశాడు.

'ముంబయిపై నీ ముద్ర చెరగనిది- ఎప్పటికీ నువ్వే మా కెప్టెన్​'

ముంబయి ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం- MI కెప్టెన్​గా హార్దిక్ పాండ్య

Last Updated : Dec 16, 2023, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details