తెలంగాణ

telangana

Indvseng: 'పంత్​ మ్యాచ్ విన్నర్.. కాస్త ఓపిక పట్టండి'

By

Published : Sep 1, 2021, 5:32 AM IST

ఇంగ్లాండ్​తో జరుగుతున్న టెస్టు సిరీస్​లో మెరుగైన ప్రదర్శన చేయలేకపోతున్న పంత్(rishabh pant england test) మిగిలిన మ్యాచ్​ల్లో​ రాణిస్తాడని విశ్వాసం వ్యక్తం చేశాడు క్రికెటర్​, కామెంటేటర్​ దినేశ్​ కార్తీక్​. అతడు బ్యాటింగ్​ తీరులో పెద్దగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదన్నాడు.

pant
పంత్​

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో టీమ్‌ఇండియా వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌(rishabh pant england test) కీపింగ్‌లో రాణిస్తున్నప్పటికీ.. బ్యాటింగ్‌లో మాత్రం విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు ఈ సిరీస్‌లో ఐదు ఇన్నింగ్స్‌లు ఆడిన పంత్.. 17.40 సగటుతో కేవలం 87 పరుగులు మాత్రమే చేసి విమర్శలపాలవుతున్నాడు. అయితే, ఈ సిరీస్‌లోని మిగిలిన మ్యాచ్‌ల్లో పంత్‌ రాణిస్తాడని భారత క్రికెటర్‌ దినేశ్ కార్తీక్‌(dinesh karthik commentary) విశ్వాసం వ్యక్తం చేశాడు. బ్యాటింగ్‌ తీరులో రిషభ్ పెద్దగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదన్నాడు. ఈ సిరీస్‌లో భారత్‌ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

"ఆస్ట్రేలియా పర్యటనలో పంత్ మంచి ప్రదర్శన కనబరిచి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతడికి కొంచెం సమయం ఇచ్చి ఎదగడానికి సహకరించండి. సిరీస్‌ మధ్యలో రిషభ్‌.. తన బ్యాటింగ్‌ తీరులో పెద్దగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నా. ఇంగ్లాండ్‌లో ఎలా ఆడాలో అతడికి తెలుసు. పంత్ మ్యాచ్‌ విన్నర్‌. అతడు రాణిస్తాడనే నమ్మకం నాకుంది"

-దినేశ్‌ కార్తీక్‌, కామెంటేటర్​.

ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య సెప్టెంబరు 2న ఓవల్‌ వేదికగా నాలుగో టెస్టు ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌లో మొదటి టెస్టు డ్రా అయింది. రెండో టెస్టులో కోహ్లీసేన విజయం సాధించగా.. మూడో టెస్టులో ఇంగ్లాండ్ గెలుపొందడం వల్ల సిరీస్‌ 1-1తో సమం అయింది.

ఇదీ చూడండి: దిల్లీ పగ్గాలు పంత్​కే.. శ్రేయస్​పై ఒత్తిడి ఉండొద్దనే!

ABOUT THE AUTHOR

...view details