తెలంగాణ

telangana

కోహ్లీ బెస్ట్ బ్యాటర్‌.. కానీ ఆసీస్‌తో అంత ఈజీ కాదు: రికీ పాంటింగ్‌

By

Published : Sep 2, 2022, 8:04 AM IST

విరాట్​ కోహ్లీ ఫామ్​పై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ స్పందించాడు. కోహ్లీ తిరిగి ఫామ్​లోకి వచ్చాడని, అతను అత్యుత్తమ బ్యాటర్​ అని ప్రశంసించాడు. అయితే ఆసీస్​తో తలపడేటప్పుడు అంతగా రాణించకపోవచ్చని చెప్పాడు.

virat kohli form
ricky-ponting-on-virat-kohli-form-coming-t20-world-cup

Virat Kohli form : దాదాపు నెలరోజులపాటు ఆటకు దూరంగా ఉన్న టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీ ఆసియా కప్‌ బరిలోకి దిగాడు. పాక్‌పై 35, హాంకాంగ్‌ జట్టు మీద 59 నాటౌట్‌ పరుగులు సాధించాడు. తన మానసిక ఆరోగ్య సమస్యలు, క్రికెట్‌కు విరామం తీసుకోవడం గురించి కోహ్లీ ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో వివరణ ఇచ్చాడు. మళ్లీ తిరిగి వచ్చిన విరాట్ తన ఫామ్‌ను అందుకున్నట్లే కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ ఫామ్‌పై ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్‌ విశ్లేషించాడు. వచ్చే టీ20ప్రపంచకప్‌లో తప్పకుండా పరుగులు సాధించేందుకు కోహ్లీ వస్తాడని పేర్కొన్నాడు.

"విరాట్ పరుగులు చేయడం చూశా. అలానే ఇటీవల కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో కోహ్లీ గురించి వస్తున్న విమర్శలనూ గమనించా. మళ్లీ బ్యాట్ పట్టిన విరాట్ చీకటి గదిలో కూర్చొని తానేంటో తెలుసుకున్నాడని అనిపించింది. మనలో చాలా మంది చేయలేని పని విరాట్ చేశాడు. ఏం చెప్పాలనుకున్నాడో.. దానిని చెప్పేశాడు. ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నట్లు భావిస్తున్నాడు. అందుకే టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీలోని అత్యుత్తమ బ్యాటర్‌ను మళ్లీ చూస్తామని గట్టిగా చెప్పగలను. మెగా టోర్నీలో కీలకమైన ఆటగాళ్లలో కోహ్లీ ఒకడవుతాడనే నమ్మకముంది. అయితే ఇదే సమయంలో ఆసీస్‌తో ఆడేటప్పుడు మాత్రం భారీగా పరుగులు చేస్తాడని మాత్రం అనుకోవద్దు" అని పాంటింగ్‌ వివరించాడు.
హాంకాంగ్‌తో మ్యాచ్‌లో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో విరాట్ (59) రాణించాడు.

ABOUT THE AUTHOR

...view details