తెలంగాణ

telangana

ఉమ్రాన్ కోసం తండ్రి త్యాగం.. కష్టాలకు దూరం చేసి.. కలను సాకారం చేసి..

By

Published : May 24, 2022, 3:41 PM IST

Umran Malik: ఐపీఎల్​లో సత్తా చాటిన సన్​రైజర్స్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్​కు టీమ్ ఇండియాలో చోటు దక్కడంపై అతని తండ్రి సంతోషం వ్యక్తం చేశారు. తన కుమారుడ్ని ఏనాడూ తనలా కూరగాయలు అమ్మాలని కోరుకోలేదని, అందుకే షాపు వైపు కూడా రానివ్వలేదని పేర్కొన్నారు. ఈటీవీ భారత్​తో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొని ఉమ్రాన్​కు సంబంధించిన కీలక విషయాలు వెల్లడించారు.

Umran Malik father
'నా కుమారుడు కూరగాయలు అమ్మాలని నేను ఏనాడు కోరుకోలేదు'

Umran Malik News: ఉమ్రాన్ మాలిక్.. ఇప్పుడు దేశమంతా మారుమోగుతున్న పేరు. ఈ ఏడాది ఐపీఎల్​లో సన్​రైజర్స్ తరఫున ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ జమ్ముకశ్మీర్​ యువ కెరటం. మెరుపు వేగంతో బంతులేస్తూ ప్రత్యర్థి బ్యాటర్లను హడలెత్తించాడు. ఇతడి బౌలింగ్​ ప్రదర్శన చూసి సెలక్టర్లు కూడా దాసోహం అయ్యారు. త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్​కు టీమ్ ఇండియా జట్టులో చోటు కల్పించారు. అయితే ఈ విషయం తెలిసినప్పుడు ఉమ్రాన్​ మాలిక్ తండ్రి అబ్దుల్ రషీద్.. కశ్మీర్​ షాహిదీ చౌక్​లోని తన దుకాణంలో కూరగాయలు, పండ్లు విక్రయిస్తున్నారు.

'నా కుమారుడు కూరగాయలు అమ్మాలని నేను ఏనాడు కోరుకోలేదు'

Umran Malik Team India: ఉమ్రాన్ అంతర్జాతీయ మ్యాచ్​లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వాహించబోతున్నాడని తెలిసి అతని చుట్టుపక్కల వాళ్లందరూ సంబరాలు చేసుకున్నారు. ఉమ్రాన్ తండ్రి రషీద్ మాత్రం ఎంతో ప్రశాంతంగా తన దుకాణానికి వచ్చే కస్టమర్లకు, స్నేహితులకు మిఠాయిలు పంచారు. ఆయనను పలకరించేందుకు వెళ్లిన ఈటీవీ భారత్ ప్రతినిధులకు కూడా స్వీట్లు ఇచ్చి ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం తన కుమారుడి గురించి వివరించారు.

'నా కుమారుడు కూరగాయలు అమ్మాలని నేను ఏనాడు కోరుకోలేదు'

ఉమ్రాన్​ మాలిక్​ తనలా షాపులో కూరగాయలు, పండ్లు అమ్మాలని ఏనాడూ కోరుకోలేదని తండ్రి రషీద్ చెప్పారు. అందుకే ఉమ్రాన్​ తన స్నేహితులతో క్రికెట్​ ఆడుతుంటే ఏనాడూ అడ్డు చెప్పలేదని పేర్కొన్నారు.

'నా కుమారుడు కూరగాయలు అమ్మాలని నేను ఏనాడు కోరుకోలేదు'

" నా కుమారుడిపై దేశమంతా ప్రేమానురాగాలు చూపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రజలు అతడ్ని ప్రేమిస్తూనే ఉంటారు. చిన్నప్పటి నుంచి ఉమ్రాన్​కు క్రికెట్ అంటే ప్రాణం. ఇప్పుడు దేశం తరఫున ఆడి భారత్​కు గొప్ప విజయాలు అందించాలని కోరుకుంటున్నా. ఉమ్రాన్ కూరగాయల దుకాణం నడపాలని నేను ఎప్పుడూ కోరుకోలేదు. అందుకే అతడ్ని ఎప్పుడూ షాపు వైపు కూడా రానివ్వలేదు. ఎప్పుడూ తన కలలు సాకారం చేసుకోవాలనే ప్రోత్సహించా. ఉమ్రాన్​ ఎంతో శ్రమిస్తాడు. ట్రైనింగ్​కు ఏం కావాలన్నా నేను ఏర్పాటు చేశా. ఉమ్రాన్ తల్లితో పాటు అతని ఇద్దరు సిస్టర్స్​ కూడా ఎప్పుడూ మద్దతుగా ఉన్నారు. మాకు పరిమితులు ఉన్నప్పటికీ ఉమ్రాన్​కు అవసరమైనవన్నీ సమాకూర్చాం"

--అబ్దుల్ రషీద్​, ఉమ్రాన్ మాలిక్ తండ్రి

ఇదీ చదవండి:పాపం రిషభ్​ పంత్​.. అత్యాశకు పోయి రూ.కోట్లలో నష్టపోయాడు..

ABOUT THE AUTHOR

...view details