తెలంగాణ

telangana

వేలంపాటలో రూ.20లక్షలకూ అమ్ముడుపోలేదు.. ఇప్పుడు అతడే హీరో..

By

Published : May 26, 2022, 10:04 AM IST

IPL 2022: ఐపీఎల్​ ప్లే ఆఫ్స్​లో అద్భుత శతకంతో ఆర్​సీబీని ఒంటిచేత్తో గెలిపించాడు రజత్ పటీదార్​. తన జట్టును క్వాలిఫయర్ 2కు చేర్చాడు. అయితే ఈ యువ ఆటగాడు ఐపీఎల్​ వేలం పాటలో రూ.20లక్షలకు కూడా అమ్ముడు పోలేదని మీకు తెలుసా? ఓ ప్లేయర్​కు గాయం కారణంగా జట్టులోకి వచ్చిన పటీదార్​.. అవకాశాలను అందిపుచ్చుకుని సత్తా చాటాడు. ఇప్పుడు అన్ని ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించాడు.

Rajat Patidar
రజత్ పటీదార్

Rajat Patidar: ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్​లో ఆర్సీబీకి అద్భుత విజయాన్ని అందించాడు రజత్ పటీదార్. మెరుపు శతకంతో జట్టుకు భారీ స్కోరు అందించి విజయంలో కీలక పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లీ, ఫాప్ డుప్లెసిస్ వంటి దిగ్గజ ఆటగాళ్లు పరుగులు చేయడానికి ఇబ్బందిపడ్డ చోట చూడచక్కని షాట్లు ఆడాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి లఖ్​నవూ బౌలర్లను బెంబేలెత్తించాడు. అంతేకాదు ఐపీఎల్​ ప్లే ఆఫ్స్​లో ఆర్​సీబీ తరఫున సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్​తో హీరోగా మారిన రజత్​ పటీదార్​ను ఐపీఎల్ వేలంపాటలో ఎవరూ కొనుగోలు చేయలేదంటే నమ్మగలరా? కానీ ఇది నిజం. గతేడాది ఆర్​సీబీ తరఫున నాలుగు మ్యాచ్​లు ఆడి ఓ మ్యాచ్​లో 71 పరుగులు చేసినప్పటికీ.. అతని కోసం కనీస ధర రూ.20లక్షలు చెల్లించేందుకు కూడా ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దీంతో అతను అమ్ముడుపోని ఆటగాళ్ల జాబితాలో మిగిలాడు.

రజత్ పటీదార్

IPL Emilinator: అయితే పటీదార్​కు ఈసారి అదృష్టం కలిసొచ్చింది. ఆర్​సీబీ ప్లేయర్​ లవ్​నిత్​ సిసోడికి గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడం వల్ల అతని స్థానాన్ని భర్తీ చేసేందుకు పటీదార్​ను జట్టులోకి తీసుకున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని పటీదార్ ప్లే ఆఫ్స్​ మ్యాచ్​లో చోటు దక్కించుకున్నాడు. ఇక మ్యాచ్​లో విశ్వరూపం ప్రదర్శించి తన సత్తా ఏంటో అందరికీ తెలియజేశాడు. 52 బంతుల్లో 207 స్ట్రయిక్ రేట్​తో 12 ఫోర్లు, 7 సిక్సర్లు బాది అజేయంగా నిలిచాడు. దీంతో ఆర్సీబీ 207 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేదనలో లఖ్​నవూ 193 పరుగులే చేసింది. ఫలితంగా 14 పరుగుల తేడాతో గెలిచి ఆర్​సీబీ క్వాలిఫయర్స్ 2కు చేరింది. మే 27న జరిగే ఈ మ్యాచ్​లో రాజస్థాన్ రాయల్స్​తో తలపడనుంది. గెలిస్తే ఫైనల్​లో టైటిల్​ కోసం గుజరాత్ టైటాన్స్​ను ఢీకొంటుంది. ఈ రెండు మ్యాచ్​లు అహ్మదాబాద్ వేదికగానే జరగనున్నాయి.

రజత్ పటీదార్

IPL News: మ్యాచ్ అనంతరం ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్ అవార్డు తీసుకుంటూ పటీదార్​ మాట్లాడాడు. పవర్ ప్లే చివరి ఓవర్లలో కృనాల్​ పాండ్య బౌలింగ్​లో భారీ షాట్లు ఆడిన తర్వాత తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పాడు. అప్పటి నుంచి మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసినట్లు వివరించాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం, తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నందుకు ఆనందంగా ఉందన్నాడు. రాజస్థాన్​తో పోరు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నాడు.

రజత్ పటీదార్

ఇదీ చదవండి:రాహుల్​ పోరాడినా.. ప్లేఆఫ్స్​ నుంచి లఖ్​నవూ ఔట్​.. ఆర్సీబీ ముందంజ

ABOUT THE AUTHOR

...view details