తెలంగాణ

telangana

ట్విస్ట్ ఇచ్చిన రాహుల్​ ద్రవిడ్​ - 'నేను ఇంకా సంతకం చేయలేదు'

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 7:41 AM IST

Rahul Dravid Team India Coach : టీమ్ఇండియా కోచ్​గా రాహుల్ ద్రవిడ్​ పదవి కాలం పొడిగింపు నేపథ్యంలో రాహుల్​ ద్రవిడ్​ ఓ చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. ఇంతకీ ఏం జరిగిందంటే ?

Rahul Dravid Team India Coach
Rahul Dravid Team India Coach

Rahul Dravid Team India Coach : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 పైన‌ల్ మ్యాచ్ తర్వాత రాహుల్ ద్రవిడ్ ప‌ద‌వి కాలం కూడా ముగిసింది. దీంతో అత‌డితో పాటు పలువురు స‌హాయక సిబ్బంది కాంట్రాక్ట్‌ల‌ను పొడిగిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. కానీ ఎంత కాలానికి అని మాత్రం వెల్లడించలేదు. ఇక ఇదే విషయంపై రాహుల్​ను ప్రశ్నించగా.. తాను ఇప్ప‌టి వ‌ర‌కు దానిపై సంత‌కం చేయ‌లేదని.. బీసీసీఐ నుంచి అధికారికంగా పేప‌ర్లు వ‌చ్చే వరకు వెయిట్ చేయాల‌ని అన్నాడు.

"ఇప్పటికీ అధికారికంగా ఇంకా ఏ విషయం బయటకు రాలేదు. నేను ఇంకా సంతకం చేయలేదు. నాకు ఆ పేపర్లు అందిన తర్వాత చర్చిస్తాం. ఆ తర్వాతే మీకేమైనా తెలుస్తుంది" అని ద్రవిడ్ మీడియాతో అన్నాడు. అయితే ఆయన త్వరలోనే బాధ్యతలను చేపట్టనున్నాడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

మరోవైపు ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌తో హెడ్​ కోచ్​గా ద్రవిడ్​ రెండోసారి బాధ్య‌త‌ల‌ను చేప‌ట్టనున్నాడు. డిసెంబ‌ర్ 10 నుంచి ఈ ప‌ర్య‌ట‌న ప్రారంభం కానుండగా.. ఇందులో భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వ‌న్డేలు, రెండు టెస్టు మ్యాచులు ఆడ‌నుంది. దీని తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరగనున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ కూడా ఆడ‌నుంది. ఇక జూన్‌లో వెస్టిండీస్‌, యూఎస్ఏ ఆతిథ్యం ఇస్తున్న ఐసీసీ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ పోరుకు భారత జట్టు సిద్ధం కానుంది.

2021 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా నిరాశ‌ప‌ర‌చ‌డం వల్ల ర‌విశాస్త్రి స్థానంలో రెండు సంవ‌త్స‌రాల కాంట్రాక్టుకు రాహుల్ ద్ర‌విడ్ హెడ్ కోచ్‌గా బాధ్య‌త‌లు చేపట్టాడు. అప్పుడు నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ చీఫ్ ఉన్న ద్ర‌విడ్‌ను మాజీ కెప్టెన్‌, అప్ప‌టి బీసీసీఐ అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీ ఒప్పించి మరీ ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

ఇక ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా వరుస విజయాల్లోనూ ద్రవిడ్‌ కీలక పాత్ర ఉంది. ఒక్కో ఆటగాడికి ఒక్కో ప్రత్యేక బాధ్యతను అప్పగించడం ఎంత గొప్ప ఫలితాన్నిచ్చిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్లాన్​ను అమలు చేసే విషయంలో ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ.. ద్రవిడ్‌ తన ప్రపంచకప్‌ ప్రణాళిక నుంచి పక్కకు జరగలేదు. జట్టులో విపరీతంగా మార్పులు కూడా చేయలేదు. అన్నింటికన్నా మిన్నగా తన ఫ్రెండ్లీ స్పిరిట్​తో ప్లేయర్ల విశ్వాసాన్ని, అభిమానాన్ని, గౌరవాన్ని పొందాడు. ఇదే జట్టు సక్సెస్​కు మూల కారణం.

రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ పొడగింపు - బీసీసీఐ అఫీషియల్ అనౌన్స్​మెంట్

ఎంత వ్యతిరేకత వచ్చినా తగ్గలేదు - ఫ్రెండ్లీ స్పిరిట్​తో ముందుకు సాగిన మిస్టర్ డిపెండబుల్​

ABOUT THE AUTHOR

...view details