తెలంగాణ

telangana

టీ20 ప్రపంచకప్​లో పంత్​-దినేశ్​ కార్తిక్​.. ద్రవిడ్ రియాక్షన్​​

By

Published : Jun 20, 2022, 10:51 AM IST

Dravid about pant Dinesh Karthik
టీ20 ప్రపంచకప్​లో పంత్​-దినేశ్​ కార్తిక్​ ()

Panth VS Dinesh karthik: రాబోయే కొద్ది నెలలవరకు టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌, బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ జట్టులో అంతర్భాగమని ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పష్టం చేశాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్​లో చూపించిన ఫామ్​నే దినేశ్​ కార్తిక్​ కొనసాగిస్తే జట్టుకు మరింత ఉపయోగమని అన్నాడు.

Panth VS Dinesh karthik: రాబోయే టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జట్టులో పంత్​-దినేశ్​కార్తిక్ స్థానాల​పై వస్తున్న అనుమానాల గురించి మాట్లాడాడు ప్రధాన కోచ్​ రాహుల్ ద్రవిడ్​. రాబోయే కొద్ది నెలలవరకు పంత్‌ టీమ్​లో అంతర్భాగమని స్పష్టం చేశాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో పంత్‌ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. సిరీస్‌ 2-2తో సమమైనా.. అతడు బ్యాటర్‌గా విఫలమయ్యాడు. మరోవైపు దినేశ్‌ కార్తీక్‌ అద్భుత ప్రదర్శన చేసి తనలోని ఆటగాడిని బయటపెట్టాడు. పొట్టి ఫార్మాట్‌లో పంత్‌ నిలకడలేమి కారణాలతో టీ20 ప్రపంచకప్‌లో ఉంటాడా లేదా అనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ద్రవిడ్‌ మాట్లాడాడు.

"పంత్‌ దూకుడుగా ఆడే క్రమంలో ఈ సిరీస్‌లోని పలు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. కానీ, అతడికి ఉన్న శక్తి సామర్థ్యాల మేరకు అతడు టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ లైనప్‌లో అంతర్భాగమే. అలాగే అతడు ఎడమచేతి వాటం గల బ్యాట్సమన్‌ కావడం వల్ల మధ్య ఓవర్లలో మాకు చాలా కీలకమైన ఆటగాడు. రాబోయే కొద్ది నెలల్లో మా ప్రణాళికల పరంగా అతడు కీలక ఆటగాడిగా ఉంటాడు. అలాగే ఈ ఒక్క సిరీస్‌తోనే అతడి కెప్టెన్సీని అంచనా వేయలేం. అతడో యువ సారథి. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు. 0-2 నుంచి 2-2తో సిరీస్‌ సమం చేయడం మంచి విషయం" అని ద్రవిడ్‌ అన్నాడు.

దినేశ్‌ కార్తిక్‌ గురించి మాట్లాడుతూ.. "గత రెండు మూడు నెలల నుంచి అతడు ఆడుతున్న తీరు నేపథ్యంలో ఈ సిరీస్‌కు ప్రత్యేకంగా ఎంపిక చేశాం. దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. రాజ్‌కోట్‌లో భారీ ఇన్నింగ్స్‌ అవసరమైన వేళ చెలరేగిపోయాడు. హార్దిక్‌ పాండ్యతో కలిసి చివరి ఐదు ఓవర్లు ఉతికారేశాడు. కార్తీక్‌ ఇలా రాణించడం రాబోయే రోజుల్లో జట్టుకు మరింత ఉపయోగమం. యువకులకు అవకాశం వస్తే కేవలం పరుగులు చేయడం కాకుండా కార్తిక్‌లా రెచ్చిపోవాలని సూచిస్తా" అని చెప్పాడు.

ఇదీ చూడండి: సరికొత్తగా సాహా.. ఆ జట్టుకు మెంటార్​గా!

ABOUT THE AUTHOR

...view details