సరికొత్తగా సాహా.. ఆ జట్టుకు మెంటార్​గా!

author img

By

Published : Jun 20, 2022, 8:34 AM IST

Wriddhiman saha as mentor
మెంటార్​గా సాహా ()

Wriddhiman saha as mentor: టీమ్ఇండియా సీనియర్​ ప్లేయర్​ వృద్ధిమాన్​ సాహా.. కొత్త బాధ్యతలు తీసుకోబోతున్నట్లు తెలిసింది. దేశవాళీలో త్రిపుర తరపున ఆడడం సహా ఆ జట్టుకు మెంటార్​గా వ్యవహరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.

Wriddhiman saha: టీమ్‌ఇండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ వృద్ధిమాన్‌ సాహా.. సరికొత్త అవతారంలో కనిపించేందుకు సిద్ధమవుతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి క్రికెట్​ వర్గాలు. భారత జట్టుకు దూరమైన అతడు.. దేశవాళీలో బెంగాల్‌ జట్టు నుంచి కూడా తప్పుకున్నాడు. అయితే ఇప్పుడతడు.. త్రిపుర తరపున ఆడడం సహా ఆ జట్టుకు మెంటార్​గా వ్యవహరించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం. క్యాబ్‌ ప్రతినిధులతో విభేదాల కారణంగా అతడు బెంగాల్‌కు గుడ్‌బై చెప్పాడు.

టీమ్‌ఇండియాకు దూరమైన సాహా అంకితభావాన్ని క్యాబ్‌ సంయుక్త కార్యదర్శి దెబబ్రత దాస్‌ ప్రశ్నించాడు. దీంతో ఈ సీజన్‌ రంజీ గ్రూప్‌ మ్యాచ్‌ల్లో సాహా బరిలో దిగలేదు. తనను సంప్రదించకుండానే క్వార్టర్స్‌ పోరుకు అతన్ని జట్టులోకి ఎంపిక చేశారు. కానీ దెబబ్రత తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ సాహా బెంగాల్‌ను వీడాడు. 37 ఏళ్ల అతడు ఈ ఏడాది టీ20 లీగ్‌లో గొప్ప ప్రదర్శనతో గుజరాత్‌ టైటిల్‌ నెగ్గడంలో కీలకంగా వ్యవహరించాడు. 2007లో బెంగాల్‌ తరపున అరంగేట్రం చేసిన అతను 122 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లాడాడు.

ఇదీ చూడండి: 8 నెలల్లో ఆరుగురు కెప్టెన్లు.. ద్రవిడ్​ ఏం అన్నాడంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.