తెలంగాణ

telangana

ఆట- దాతృత్వంలో కమిన్స్​ స్టైలే వేరు

By

Published : May 8, 2021, 1:07 PM IST

క్రికెట్​లో ఉత్తమ ప్రదర్శనతో పాటు దాతృత్వాన్ని చాటుకుంటున్నాడు వరల్డ్ నెంబర్ వన్ బౌలర్​, ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్ కమిన్స్. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా.. ఓ ప్రత్యేక కథనం.

pat cummins
ప్యాట్ కమిన్స్, ఆస్ట్రేలియా బౌలర్

బౌలింగ్‌, బ్యాటింగ్‌తో పాటు దాతృత్వాన్ని చాటుకుంటున్న వరల్డ్‌ నెంబర్‌ వన్‌ బౌలర్‌, ఆస్ట్రేలియా యువ దిగ్గజ క్రికెటర్‌... ప్యాట్‌ కమిన్స్‌. 2020 ఐపీఎల్‌ వేలంలో అత్యధిక ధర దక్కించుకున్న ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన ప్యాట్‌ కమిన్స్‌ 28వ పడిలో అడుగుపెట్టాడు. 2021 సీజన్‌లో కరోనా బాధితులకు విరాళం ప్రకటించి వార్తల్లో నిలిచాడు.

ప్యాట్ కమిన్స్

ప్యాట్ కమిన్స్‌ చిన్నతనంలో జరిగిన ఓ గాయం కారణంగా కుడి చేతి మధ్య వేలు తెగిపోయింది. ఈ గాయం కారణంగా కొన్నేళ్ల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే ఆట మీద తనకున్న ఇష్టం, బంతిని వదిలిపెట్టనివ్వలేదు. మధ్యవేలు లేకపోయినా రెండు వేళ్లతో బంతిని ఒడిసి పట్టుకుని, స్వింగ్ చేయడం కమిన్స్‌ సొంతం. ఆ ప్రయత్నం ఫలింగా ఆస్ట్రేలియా జట్టు విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్నాడు.

దాతృత్వం చాటుకుంటున్న కమిన్స్

నిప్పులు చెలరేగేలా..

మధ్య వేలు పూర్తిగా బంతిని తాకలేకపోయినా రెండు వేళ్లతో నిప్పులుచెరిగే బంతులు వేయడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు కమిన్స్‌. ఐపీఎల్ 2020 వేలంలో రూ.15 కోట్ల 50 లక్షల భారీ ప్రైజ్ దక్కించుకున్నాడు. 14 మ్యాచ్​ల్లో 12 వికెట్లు పడగొట్టాడు. బ్యాటుతోనూ రాణించి ఓ హాఫ్ సెంచరీతో పాటు మొత్తంగా 146 పరుగులు చేశాడు.

పుట్టినరోజు సందర్భంగా ప్యాట్ కమిన్స్

2021 సీజన్‌లో ఆడిన 7 మ్యాచుల్లో 9 వికెట్లు తీసిన ప్యాట్ కమిన్స్‌.. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చేసిన 66 పరుగులు చేశాడు. ఇది సీజన్‌లో హైలెట్ ఇన్నింగ్స్‌లలో ఒకటిగా నిలిచింది. బుమ్రా బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో నాలుగు సిక్సర్లు బాదిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా కూడా కమిన్స్‌ రికార్డు నెలకొల్పాడు.

కరోనా కట్టడిలో భాగంగా 50వేల డాలర్లు, భారత పీఎం కేర్స్​కు ఇస్తున్నట్లు ఆసీస్​ క్రికెటర్​ పాట్ కమిన్స్​ ఇటీవల ప్రకటించాడు. కమ్మిన్స్‌విరాళం ప్రకటించిన తర్వాత చాలా మంది క్రికెటర్లు తమవంతుగా సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

ఇదీ చదవండి:కోల్​కతా ఆటగాడు టిమ్ సీఫెర్ట్​కు కరోనా

ABOUT THE AUTHOR

...view details