తెలంగాణ

telangana

'టీ20 ప్రపంచకప్​ నిర్వహణపై ఆశలు వదులుకున్నాం'

By

Published : Oct 6, 2021, 7:46 PM IST

యూఏఈతో పాటు టీ20 ప్రపంచకప్​ను(T20 World Cup 2021) సంయుక్తంగా నిర్వహించనుంది ఒమన్ దేశం. అయితే ఇటీవలే ఆ దేశాన్ని అతాలకుతలం చేసిన షహీన్​ తుపాను(Cyclone Shaheen) కారణంగా టోర్నీ నిర్వహణపై ఆశలు వదిలేసుకున్నట్లు ఒమన్ క్రికెట్ ఛైర్మన్ పంకజ్ ఖింజీ తెలిపారు.

T20 World Cup
టీ20 ప్రపంచకప్​

ఐసీసీ టీ20 ప్రపంచకప్​ను(T20 World Cup) యూఏఈతో పాటు ఒమన్​లో నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేసింది అంతర్జాతీయ క్రికెట్​ మండలి(ICC News). అయితే ఇటీవలే ఆ దేశంలో సంభవించిన షహీన్​ తుపాను(Cyclone Shaheen) కారణంగా ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీని ఇక నిర్వహించలేమని భావించినట్లు ఒమన్ క్రికెట్(Oman Cricket) ఛైర్మన్ పంకజ్ ఖింజీ తెలిపారు. అదృష్టవశాత్తు తుపాను ప్రభావం నుంచి తాము తప్పించుకోగలిగినట్లు వెల్లడించారు.

"తుపాను కారణంగా కొద్దిలో మొత్తం తుడిచిపెట్టుకుపోయేది. కానీ, ఉత్తర దిశలోని కొన్ని నాటికల్ మైళ్ల దూరంలో తుపాను ఆగిపోయింది. లేదంటే ఒమన్​లో ప్రపంచకప్​కు గుడ్​బై చెప్పాల్సి వచ్చేది. అయితే ఇక్కడ వర్షం కారణంగా దుమ్ము, ఇసుక కొట్టుకుపోయి గ్రౌండ్​ మరింత ప్రకాశవంతంగా మారింద"ని ఖింజీ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:ఐసీసీ ప్లేయర్​ 'ఆఫ్​ ది మంత్​' రేసులో వీరే!

ABOUT THE AUTHOR

...view details