ODI World Cup 2023 IND VS PAK : వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌పై టీమ్ఇండియా మరోసారి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌తో తలపడిన ఏడుసార్లు విజయం సాధించిన భారత జట్టు.. ఎనిమిది మ్యాచ్‌లోనూ గెలుపొంది ఆ రికార్డు మరింత పదిలం చేసుకుంది. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా నేడు(అక్టోబర్ 14) జరిగిన హై టెన్షన్ మ్యాచ్‌లో అదిరిపోయే ఘన విజయం సాధించింది. ఆల్‌రౌండ్ షోతో సూపర్ విక్టరీని సొంతం చేసుకుంది. ఈ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది.
192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా.. 30.3 ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. రోహిత్ శర్మ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 63 బంతుల్లో 6 సిక్స్‌లు, 6 ఫోర్ల సాయంతో 86 పరుగులు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న గిల్(11 బంతుల్లో 16; 4 x 6), కోహ్లీ(18 బంతుల్లో 16; 3 x4) దూకుడుగా ఆడి తక్కువ స్కోరుకే ఔట్ అయిపోయారు. కేఎల్ రాహుల్ 19 (29 బంతుల్లో 2 ఫోర్లు) రాణించాడు. ఈ క్రమంలోనే బ్యాటింగ్‌కు దిగిన శ్రేయస్ అయ్యర్(53*; 62 బంతుల్లో) హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రీది 2 వికెట్లు తీయగా.. హసన్ అలీ ఓ వికెట్ దక్కించుకున్నాడు.