తెలంగాణ

telangana

లెజెండ్స్ క్రికెట్ లీగ్​లో మహ్మద్ కైఫ్, బిన్నీ

By

Published : Jan 8, 2022, 9:51 AM IST

Legends League Cricket: రిటైరైన క్రికెటర్లతో జరగబోతున్న లెజెండ్స్ లీగ్ క్రికెట్​ టోర్నీలో ఇండియా మహారాజా జట్టులోకి మరో ఇద్దరు వచ్చి చేరారు. మహ్మద్ కైఫ్, స్టువర్ట్ బిన్నీ కూడా ఈ టోర్నీలో ఆడబోతున్నారు. ఇప్పటికే భారత్​ తమ జట్టును ప్రకటించింది.

Kaif Stuart Binny news, Kaif Stuart Binny Join India Maharaja Team, కైఫ్ బిన్నీ ఇండియా మహారాజా, లెజెండ్స్ క్రికెట్ లీగ్
Kaif Stuart Binny

Legends League Cricket: రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ల కోసం లెజెండ్స్ లీగ్ క్రికెట్ టోర్నీ నిర్వహించబోతున్నారు. ఒమన్, మస్కట్ వేదికగా జరగబోతున్న ఈ టోర్నీలో మూడు జట్లు పాల్గొనబోతున్నాయి. అందులో భారత ఆటగాళ్లు ఇండియా మహారాజా జట్టులో ఆడనున్నారు. ఇప్పటికే సెహ్వాగ్, హర్బజన్ సింగ్, యువరాజ్​లతో కూడిన జట్టును ప్రకటించగా తాజాగా మరో ఇద్దరు టీమ్​తో కలవనున్నారు. మాజీ క్రికెటర్లు మహ్మద్ కైఫ్, స్టువర్ట్ బిన్నీలు కూడా జట్టులో చేరబోతున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.

మొదటి సీజన్​ జనవరి 20 నుంచి ప్రారంభంకానుంది. ఇందులో మూడు జట్లు పాల్గొనబోతున్నాయి. ఇండియా మహారాజా టీమ్​తో పాటు ఆసియా లయన్స్, రెస్టాఫ్ ది వరల్డ్​ జట్లు పోటీపడబోతున్నాయి. ఇప్పటికే ఇండియాతో పాటు ఆసియా లయన్స్​ జట్లను ప్రకటించాయి. రెస్టాఫ్ ది వరల్డ్ జట్టును ప్రకటించాల్సి ఉంది.

జట్లు ఇవే..

ఇండియా మహారాజా

వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, మహ్మద్ కైఫ్, స్టువర్ట్ బిన్నీ బద్రినాథ్, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్ ఓజా, మన్​ప్రీత్ గోనీ, హేమంగ్ బదాని, వేణుగోపాల్ రావు, మునాఫ్ పటేల్, సంజయ్ బంగర్, నయన్ మోంగియా, అమిత్ భండారి

ఆసియా లయన్స్

షోయబ్ అక్తర్, షాహిద్ అఫ్రిదీ, సనత్ జయసూర్య, ముత్తయ్య మురళీధరన్, కమ్రన్ అక్మల్, చమింద వాస్, రోమేష్ కలువితరన, దిల్షాన్, అజార్ మహ్మూద్, ఉపుల్ తరంగ, మిస్బావుల్ హక్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, మొహమ్మద్ యూసఫ్, ఉమల్ గుల్, అస్గర్ అఫ్గాన్.

ఇవీ చూడండి: పాక్ పేసర్​కు ధోనీ స్పెషల్​ గిఫ్ట్​

ABOUT THE AUTHOR

...view details