తెలంగాణ

telangana

స్టార్ క్రికెటర్​పై వేటు.. రెండు మ్యాచ్​ల నిషేధం

By

Published : Mar 23, 2022, 12:04 PM IST

Jason Roy ban: ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్​ రాయ్​కు ఆ దేశ బోర్డు షాక్ ఇచ్చింది. అతడిపై రెండు అంతర్జాతీయ మ్యాచ్​ల నిషేధం విధించింది. రూ.2.5 లక్షల జరిమానా కట్టాలని ఆదేశించింది. అయితే, ఇందుకు స్పష్టమైన కారణాలను తెలియజేయలేదు.

jason roy ban
jason roy ban

Jason Roy ban: ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్​పై ఆ దేశ క్రికెట్ బోర్డు ఈసీబీ రెండు మ్యాచ్​ల నిషేధం విధించింది. ఇంగ్లాండ్ ఆడే తదుపరి రెండు అంతర్జాతీయ మ్యాచ్​లకు జేసన్ రాయ్ అందుబాటులో ఉండడని ఈసీబీ స్పష్టం చేసింది. దీంతో పాటు రూ.రెండున్నర లక్షలు(2500 పౌండ్లు) జరిమానా విధించింది. మార్చి 31లోపు జరిమానా కట్టాలని ఆదేశించింది. క్రికెట్​ ప్రయోజనాలకు విరుద్ధంగా తాను నడుచుకున్నానని జేసన్ రాయ్ ఒప్పుకున్నాడని అందుకే నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. అయితే, ఇందుకు నిర్దిష్ట కారణాలను తెలియజేయలేదు.

"క్రికెట్ క్రమశిక్షణ కమిషన్ జేసన్ రాయ్​పై చర్యలు తీసుకుంది. అతడిపై ఆంక్షలు విధించింది. క్రికెట్ ప్రయోజనాలతో పాటు, తనకు, బోర్డుకు అపఖ్యాతి కలిగేలా వ్యవహరించానని జేసన్ ఒప్పుకున్నాడు. ఈసీబీ నిబంధన 3.3ని ఉల్లంఘించాడు" అని బోర్డు వివరించింది.

వైట్ బాల్ స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన జేసన్ రాయ్.. ఇంగ్లాండ్ తరఫున 98 వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. 40.19 సగటు, వందకు పైగా స్ట్రైక్​ రేట్​తో 3658 పరుగులు చేశాడు. జనవరిలో వెస్టిండీస్​పై చివరి అంతర్జాతీయ టీ20 ఆడిన రాయ్.. జూన్​లో నెదర్లాండ్స్​తో జరిగే వన్డే సిరీస్​కు ఎంపికయ్యేందుకు ఎదురుచూస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈసీబీ నిషేధం విధించింది.

ఇదీ చదవండి:66 బంతుల్లో 161 రన్స్.. ఒక్క సిక్స్ లేకుండానే విధ్వంసం

ABOUT THE AUTHOR

...view details