తెలంగాణ

telangana

RCB Vs KKR: తడబడిన ఆర్సీబీ బ్యాట్స్​మెన్​.. కోల్​కతా లక్ష్యం 139

By

Published : Oct 11, 2021, 9:13 PM IST

Updated : Oct 11, 2021, 9:23 PM IST

IPL Eliminator 2021, RCB Vs KKR

ఐపీఎల్​లో ఎలిమినేటర్​ మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు బ్యాట్స్​మన్​ తడబడ్డారు. కోల్​కతా నైట్​రైడర్స్​ బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు నమోదు చేశారు.

షార్జా వేదికగా సాగుతున్న ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో కోల్‌కతా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడం వల్ల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మోస్తరు పరుగులకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. బెంగళూరు బ్యాటర్లలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(39) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్‌ నాలుగు, లాకీ ఫెర్గూసన్‌ 2 వికెట్‌ తీశారు.

టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఓపెనర్లు విరాట్‌ కోహ్లీ, దేవ్‌దత్‌ పడిక్కల్‌(21) శుభారంభం చేశారు. వేగంగా ఆడుతున్న క్రమంలో లాకీ ఫెర్గూసన్ వేసిన ఆరో ఓవర్లో బౌలింగ్‌లో పడిక్కల్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రీకర్‌ భరత్‌(9) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. సునీల్‌ నరైన్‌ వేసిన పదో ఓవర్లో వెంకటేశ్ అయ్యర్‌కి క్యాచ్‌ ఇచ్చి పెలిలియన్‌ చేరాడు. గ్లెన్ మాక్స్‌ వెల్‌ (15)తో కలిసి నిలకడగా ఆడుతున్న కోహ్లీ.. సునీల్‌ నరైన్‌ 13 ఓవర్లో బౌల్డయ్యాడు. డివిలియర్స్‌(11) కూడా రాణించలేకపోయాడు. నరైన్‌ వేసిన 15వ ఓవర్లో బౌల్డై పెవిలియన్‌ చేరాడు. స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు కోల్పోవడం వల్ల బెంగళూరు స్కోరు నెమ్మదించింది. వరుసగా వికెట్లు పడుతున్న నిలకడగా ఆడుతూ పరుగులు చేయడానికి ప్రయత్నించిన మాక్స్‌వెల్‌ నరైన్‌ వేసిన 17వ ఓవర్లో సునీల్‌ నరైన్ వరుసగా కీలక వికెట్లు 17వ ఓవర్లో ఫెర్గూసన్‌ చేతికి చిక్కాడు. ఆఖర్లో వచ్చిన షాబాజ్‌ అహ్మద్‌(13), డేనియల్ క్రిస్టియన్‌(9) ఆకట్టుకోలేకపోయారు. హర్షల్ పటేల్‌ (8), జార్జ్‌ గార్టన్(0) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

ఇదీ చూడండి..IPL Eliminator 2021: టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న ఆర్సీబీ

Last Updated :Oct 11, 2021, 9:23 PM IST

ABOUT THE AUTHOR

...view details