తెలంగాణ

telangana

IPL 2023 KKR VS RCB : కేకేఆర్​తో మ్యాచ్​.. డేంజర్ జోన్​లో కోహ్లీ!

By

Published : Apr 26, 2023, 4:11 PM IST

ఐపీఎల్ 2023లో భాగంగా కేకేఆర్​తో జరగబోయే మ్యాచ్​లో ఆర్సీబీ అలా చేయకపోతే కోహ్లీపై నిషేధం పడే అవకాశముంది. ఆ వివరాలు..

Kohli
IPL 2023 KKR VS RCB : కేకేఆర్​తో మ్యాచ్​.. డేంజర్ జోన్​లో కోహ్లీ!

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు స్టార్ బ్యాటర్​, స్టాండ్ ఇన్​ కెప్టెన్​ విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం డేంజర్‌ జోన్‌లో ఉన్నాడు! కోలక్​తా నైట్​ రైడర్స్​తో నేడు(ఏప్రిల్ 26) జరిగే మ్యాచులో ఆ జట్టు స్లో ఓవర్‌ రేట్‌ మెయింటైన్‌ చేస్తే.. కెప్టెన్‌గా కోహ్లీపై నిషేధం పడే ఛాన్స్ ఉంది. అతడు ఓ మ్యాచ్‌ ఆడకుండా ఉండాల్సి వస్తుంది. అలాగే రూ. 30 లక్షల జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది. దీంతోపాటే ఇంపాక్ట్​ ప్లేయర్​తో పాటు టీమ్​లోని మిగతా ఆటగాళ్లంతా రూ. 12 లక్షల ఫైన్​ లేదా మ్యాచ్‌ ఫీజులో 50 శాతం కోతను.. ఏదో ఒకటి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదే నిర్దిష్ట సమయంలో(90 నిమిషాల్లో) తమ కోటా ఓవర్లను పూర్తి చేస్తే.. ఆర్సీబీ ఈ పనిష్​మెంట్​ నుంచి తప్పించుకుంటుంది. లేదంటే దీని ప్రభావం జట్టుతో పాటు కోహ్లీపై పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ జట్టు కెప్టెన్‌గా డుప్లెసిస్‌ ఉన్నా అతడికి కూడా ఇదే వర్తిస్తుంది. మరి ఏం జరుగుతుంతో చూడాలి..

స్లో ఓవర్‌ రేట్‌ రూల్స్‌ ప్రకారం.. బౌలింగ్‌ చేసే టీమ్​.. నిర్దిష్ట సమయంలో 20 ఓవర్లు పూర్తి చేయాలి. లేదంటే తొలిసారి జట్టు కెప్టెన్‌కు రూ.12 లక్షల జరిమానా విధిస్తారు. రెండో సారి ఇదే తప్పు కొనసాగిస్తే.. కెప్టెన్​కు రూ. 24 లక్షలు, టీమ్​ ప్లేయర్స్​కు రూ.6 లక్షలు లేదా మ్యాచ్‌ ఫీజ్‌లో 25 శాతం కోత.. అదే మూడోసారి జరిగినే కెప్టెన్‌కు రూ.30 లక్షలతో పాటు ఒక మ్యాచ్‌ నిషేధం, జట్టు సభ్యులకు రూ.12 లక్షల ఫైన్​ లేదా మ్యాచ్‌ ఫీజ్‌లో 50 శాతం కోత విధిస్తారు.

కాగా, ఈ సీజన్​లో బెంగళూరు.. కేవలం ముగ్గురు బ్యాటర్ల ప్రదర్శనపైనే ఆధరపడుతోంది. ఇప్పటివరకు ఏడు మ్యాచులు ఆడిన ఆర్సీబీ.. నాలుగింటిలో గెలవగా.. మూడింటిలో ఓడింది. మొదట.. ముంబయి ఇండియన్స్‌ను ఓడించి జోరు చూపించిన ఆ జట్టు.. ఆ తర్వాత కోల్‌కతా, లఖ్‌నవూ, సీఎస్కేపై ఓటములను అందుకుంది. అనంతరం దిల్లీ క్యాపిటల్స్​, పంజాబ్ కింగ్స్​, రాజస్థాన్‌ రాయల్స్​పై గెలిచి మళ్లీ ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. కేకేఆర్‌ విషయానికొస్తే.. ఏడు మ్యాచ్‌లు ఆడి 2 విజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. అంటే 8వ స్థానంలో ఉంది. ఆడిన ఫస్ట్​ మ్యాచ్‌లో అదృష్టం కలిసిరాక డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో పంజాబ్​పై ఓటమిని అందుకుంది. ఆ తర్వాత రెండు మ్యాచుల్లో గెలిచింది. కానీ ఆ తర్వాత ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓటమిని అందుకుని పాయింట్ల పట్టికలో కిందికి పడిపోయింది.

ఇదీ చూడండి:రోహిత్​ విశ్రాంతి తీస్కో.. ఎందుకలా కష్టపడుతున్నావ్​

ABOUT THE AUTHOR

...view details