తెలంగాణ

telangana

12 ఓవర్లలో 132 రన్స్​.. 'ఇదేం బౌలింగ్​ రా బాబు.. మీకు ఇంకెవరు దొరకలేదా?'

By

Published : May 17, 2023, 6:58 PM IST

ఐపీఎల్​ మోస్ట్ సక్సెస్​ఫుల్ టీమ్​ ముంబయి ఇండియన్స్​కు బౌలింగ్ కష్టాలు తీరటం లేదు. ఈ సీజన్​లో ఆర్చర్ స్థానంలో ఇంగ్లాండ్ పేసర్ క్రిస్ జోర్డన్​ను తీసుకున్నా.. పెద్దగా ఫలితం ఉండట్లేదు. తాజాగా లఖ్​నవూతో మ్యాచ్​లో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న జోర్డన్​ను జట్టు నుంటి తప్పించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

chris jordan replacing archar
క్రిస్​ జోర్డాన్ రిప్లేసింగ్ జోఫ్రా ఆర్చర్

IPL 2023 Chris Jordan : ఇండియన్​ ప్రీమియర్ లీగ్​​లో ముంబయి ఇండియన్స్​ ఐదు సార్లు ఛాంపియన్​. మిగతా ఏ జట్లు కూడా ఇప్పటివరకు ఐదు టైటిళ్లు నెగ్గలేదు. పటిష్ఠమైన బ్యాటింగ్ లైనప్​తో తమదైన రోజున బీభత్సం సృష్టించగల ఆటగాళ్లకు ఆ జట్టులో కొదవ లేదు. ఐపీఎల్ ఫైనల్స్​లో సైతం 130-140 పరుగులను కాపాడుకోగలిగే నాణ్యమైన బౌలర్లు ఆ జట్టు సొంతం. ప్రతి సీజన్​లో టైటిల్ ఫేవరెట్​గా బరిలోకి దిగే ముంబయికి ఫ్యాన్​ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఏ పరంగా చూసిన ఆ జట్టు టాప్ జట్లలో ఒకటి. కానీ గత రెండేళ్లుగా ఆ జట్టును బౌలింగ్ విభాగం కలవరపెడుతోంది. 2022 వేలంలో జోఫ్రా ఆర్చర్​ను రూ.8 కోట్లకు కొనుగోలు చేసినా.. ముంబయి బౌలింగ్​లో మార్పు రాలేదు.

అయితే ఐపీఎల్​ సీజన్ 16ను ముంబయి రెండు వరుస ఓటములతో ప్రారంభించినా.. తరువాత అనూహ్యంగా పుంజుకొని హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. అయితే అడపాదడపా విజయాలు సాధిస్తున్నప్పటికీ ముంబయికి నాణ్యమైన బౌలర్లు లేకపోవటం సమస్యగా మారింది. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన జోఫ్రా ఆర్చర్ తీవ్రంగా నిరాశపరిచాడు. రీసెంట్​గా అతడి స్థానంలో వచ్చిన ఇంగ్లాండ్ బౌలర్​ క్రిస్ జోర్డాన్ సైతం ఆ జట్టు బౌలింగ్ కష్టాలను తీర్చలేకపోతున్నాడు.

క్రిస్​ జోర్డాన్

గాయం కారణంగా ఆర్చర్ 2022 సీజన్​కు దూరంగా ఉన్నాడు. ప్రస్తుత సీజన్​కు అందుబాటులోకి వచ్చిన ఆర్చర్ పెద్దగా ప్రభావమేమీ చూపలేదు. 5 మ్యాచ్​లు ఆడిన ఆర్చర్ కేవలం రెండు వికెట్లే తీయటం గమనార్హం. అయితే ఆర్చర్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్​ నుంచి వైదొలగడంతో.. ముంబయి క్రిస్ జోర్డాన్​ వైపు మొగ్గు చూపింది. ఆర్చర్​కు రిప్లేస్​మెంట్​లో జోర్డాన్​ను తీసుకొని, మే 9న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్​లో బరిలో దింపింది. గత మూడు మ్యాచ్​ల్లో మొత్తంగా 12 ఓవర్లు బౌలింగ్ చేసిన జోర్డాన్ ఏకంగా 132 పరుగులు సమర్పించుకుని కేవలం ఒక్కటంటే ఒక్కటే వికెట్ పడగొట్టాడు. తాజాగా లఖ్​నవూతో మ్యాచ్​లో ఆ జట్టు బ్యాటర్లు 50 పరుగులు బాదేశారు.

ఇలాంటి పేలవమైన బౌలింగ్​తో ప్లే ఆఫ్స్​కు ఎలా వెళ్లేది? అంటూ ముంబయి ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. బుమ్రా లేని లోటు డెత్ ఓవర్లలో స్పష్టంగా కనబడుతుందంటూ ఫ్యాన్స్ కలవరపడుతున్నారు. నాకౌట్​ దశకు వెళ్లాలంటే సన్​రైజర్స్​తో మ్యాచ్​లో జోర్డాన్ స్థానంలో మరో బౌలర్​ను తీసుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో వాపోతున్నారు. 'ఇదేం బౌలింగ్​ రా బాబు.. ఇంతకు మించి ఎవరు దొరకలేదా?' అంటూ ట్రోల్స్​ చేస్తున్నారు.

ఇక ముంబయి ఈ సీజన్​లో ఏడు మ్యాచ్​ల్లో గేలిస్తే.. దాంట్లో ఐదు ఛేదనలో నెగ్గినవే. మిగిలిన రెండు మ్యాచ్​ల్లో పెద్దగా బౌలింగ్​లో ప్రభావమేమీ చూపలేదు. గుజరాత్​తో మ్యాచ్​లో 100 పరుగులకే ఎనిమిది వికెట్లు పడగొట్టినా.. బౌలర్ రషీద్ ఖాన్ ఒక్కడే 10 సిక్సర్లు బాదాడు అంటే ముంబయి బౌలింగ్ విభాగం ఎంత బలహీనంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ బౌలింగ్​తో ప్లే ఆఫ్స్ చేరినా టైటిల్ నెగ్గడం మాత్రం అసాధ్యమని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details