తెలంగాణ

telangana

చాహర్​ వదిలేసిన ధోనీ వదల్లేదు.. సూపర్​ స్టంపౌట్​.. గిల్​ పరుగులకు ఎండ్​ కార్డ్​!

By

Published : May 29, 2023, 8:48 PM IST

Updated : May 29, 2023, 9:25 PM IST

IPL 2023 CSK
ధోనీ మ్యాజిక్​ స్టంపౌట్​

ఐపీఎల్ ఫైనల్​ మ్యాచ్​లో సీఎస్కే కెప్టెన్ ధోనీ.. గుజరాత్​ బ్యాటర్​ గిల్​ను సూపర్ ఫాస్ట్​గా స్టంపౌట్ చేశాడు. దీంతో ఈ సీజన్​లో గిల్ పరుగుల ప్రవాహానికి ముగింపు ​ కార్డు పడింది. ఈ నేపథ్యంలో ఈ సీజన్​లో గిల్​ ప్రదర్శన, ధోనీ సాధించిన రికార్డులు, స్టంపౌట్​లు గురించే ఈ కథనం..

ఇండియన్​ ప్రీమియర్ లీగ్​ 2023లో శుభమన్​ గిల్ పరుగుల ప్రవాహానికి ఎండ్​ కార్డు పడింది. సీజన్‌లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో అతడు 39 పరుగులు చేసి స్టంపౌట్ అయ్యాడు. 20 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు చేసి ప్రమాదకరంగా మారుతున్న గిల్​ను రవీంద్ర జడేజా బౌలింగ్‌లో మహీ స్టంపౌట్ చేశాడు. దీంతో మహీ తన కీపింగ్‌ టైమింగ్‌ ఎంత స్పీడుగా ఉంటుందో మరోసారి చూపించాడు.

చాహర్​పై విమర్శలు.. రెండో ఓవర్​ సెకండ్​ బాల్​ను తుషార్ దేశ్‌పాండే ఫుల్​ లెంగ్త్‌‌లో వేశాడు. శుభ్‌మన్ గిల్​ ఫ్లిక్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ఎడ్జ్ తీసుకున్న బంతి బ్యాక్‌వర్డ్ దిశగా గాల్లోకి లేచింది. అది కాస్త దీపక్ చాహర్ చేతుల్లోకి దూకుకెళ్లింది. కానీ ఈ సులభమైన క్యాచ్‌‌ను అందుకోవడంలో చాహర్ విఫలమయ్యాడు. క్యాచ్​ను నేలపాలు చేశాడు. అప్పటికీ గిల్ కేవలం మూడు పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఔట్​ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న గిల్​.. తన దూకుడును ప్రదర్శించాడు. అసలే ఈ సీజన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న గిల్​.. ఇప్పటికే గుజరాత్‌ను తుదిపోరుకు వరకు తీసుకొచ్చాడు. ఇలాంటి సయమంలో క్యాచ్‌ను నేలపాలు చేసిన దీపక్ చాహర్‌పై ఫ్యాన్స్​, నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే జడ్డూ వేసిన ఏడో ఓవర్​ ఆఖరి బంతిని గిల్​ షాట్‌ ఆడేందుకు ముందుకు వచ్చి క్రీజు దాటాడు. అసలే ఎప్పుడూ ఫుల్​ అలర్ట్​గా ఉండే మహీ.. బాల్​ను అందుకొని ఫుల్ స్పీడ్​గా స్టంప్స్‌ను ఎగరేశాడు. అలా చాహర్​ క్యాచ్​ వేదిలేసి గిల్​కు లైఫ్ ఇచ్చినా.. ధోనీ మాత్రం తన స్పీడుతో అతడిని పెవిలియన్ పంపాడు.

పవర్​ప్లేలో.. అత్యధిక స్కోరు శుభ్​మన్​ గిల్, వృద్ధిమాన్ సాహా కలిసి మొదటి వికెట్​కు 67 పరుగులు చేశారు. వీరిద్దరూ పవర్ ప్లేలో 62 పరుగులు సాధించారు. ఐపీఎల్ ఫైనల్ మ్యాచుల్లో పవర్ ప్లేలో నమోదైన అత్యధిక స్కోరు ఇది. అంతకుముందు 2015 ఐపీఎల్ ఫైనల్‌లో ముంబయి ఇండియన్స్ 61 పరుగులను తన ఖాతాలో వేసుకుంది. 2020లోనూ దిల్లీ క్యాపిటల్స్​పై ముంబయి ఇండియ్స్​ 61 పరుగులే చేసింది.

ధోనీ స్టంపౌట్​..

Dhoni stumpout ipl : 2018 ఐపీఎల్ ఫైనల్‌లో ఆరెంజ్ క్యాప్ విన్నర్ కేన్ విలియమ్స్​ను ధోనీ స్టంపౌట్ చేశాడు. మళ్లీ ఐదేళ్ల తర్వాత 2023 ఆరెంజ్ క్యాప్ విన్నర్ శుభమన్​ గిల్‌ను కూడా మహీనే స్టంపౌట్ చేయడం విశేషం. ఐపీఎల్‌ ఫైనల్స్‌లో రెండు స్టంపౌట్లు చేసిన రెండో కీపర్‌గా నిలిచాడు ధోనీ. అంతకుముందు ఆడమ్ గిల్‌కిస్ట్.. తుదిపోరులో రెండు సార్లు స్టంపౌట్లు చేశాడు.

ధోనీ 250 మ్యాచులు..

Dhoni IPL matches : ఈ ఫైనల్ మ్యాచ్​లో బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ధోనీ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలో 250 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ప్లేయర్​గా నిలిచాడు. ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల లిస్ట్​లో మహీ తర్వాత ముంబయి ఇండియన్స్​ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (243), బెంగళూరు వికెట్‌కీపర్‌ దినేశ్‌ కార్తీక్‌ (242), ఆర్సీబీ స్టార్ బ్యాటర్​ విరాట్‌ కోహ్లీ (237), చెన్నై కింగ్స్​ రవీంద్ర జడేజా (225), పంజాబ్‌ కెప్టెన్​ శిఖర్‌ ధవన్‌ (217), సీఎస్కే మాజీ ప్లేయర్లు సురేశ్‌ రైనా (205), రాబిన్‌ ఉతప్ప (205), అంబటి రాయుడు (203), రాజస్థాన్ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ (197) వరుసగా ఉన్నారు.

ఇదీ చూడండి:MS Dhoni Retirement IPL : ధోనీకి ఇదే చివరి​ ఐపీఎల్​!.. అప్పుడు కూడా ఇలాగే జరిగింది!

Last Updated :May 29, 2023, 9:25 PM IST

ABOUT THE AUTHOR

...view details