తెలంగాణ

telangana

కోహ్లీ, రోహిత్​ను ఢీకొనాలి.. వారికి అది నచ్చదు: అశ్విన్

By

Published : Apr 1, 2022, 8:02 PM IST

IPL 2022: టీమ్​ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్​ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆల్​రౌండర్ అశ్విన్. వారిద్దరినీ ఢీకొనడం తనకు చాలా ఇష్టమని చెప్పాడు. ఆ అవకాశం కోసం ఏటా ఎదురుచూస్తానని తెలిపాడు.

Virat Kohli
Rohit Sharma

IPL 2022: టీమ్​ఇండియా స్టార్​ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్​ కోహ్లీతో పోటీపడటం అంటే తనకెంతో ఇష్టమని చెప్పాడు ఆల్​రౌండర్​ రవిచంద్రన్ అశ్విన్. టీ20 లీగ్‌ వల్ల అంతర్జాతీయ ఆటగాళ్లతో కలిసి ఆడే అవకాశం యువ క్రికెటర్లకు వచ్చిందన్నాడు. ప్రస్తుత సీజన్‌లో రాజస్థాన్‌ తరఫున ఆడుతున్న అతడు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"నిజం చెప్పాలంటే టీ20 లీగ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను ఎదుర్కోవడం చాలా ఇష్టం. వారిద్దరూ నాణ్యమైన బ్యాటర్లు. అంతర్జాతీయ క్రికెట్‌లో వారితో డ్రెస్సింగ్‌ రూమ్‌ షేర్‌ చేసుకున్నా. దేశవాళీ టీ20 లీగ్‌లో మాత్రం ప్రత్యర్థిగా బరిలోకి దిగా. అందుకే ఆ ఇద్దరితో పోటీ పడటం నాకెంతో నచ్చింది. అంతేకాకుండా వారిద్దరూ బౌలర్లకు లొంగేందుకు ఇష్టపడరు. అందుకే కోహ్లీ, రోహిత్‌తో పోటీ అంటే ఇష్టపడతా"

-అశ్విన్, రాజస్థాన్ క్రికెటర్

సూర్యకుమార్‌ వచ్చేస్తున్నాడు!

ఐపీఎల్​ 2022లో భాగంగా ముంబయి, రాజస్థాన్‌ జట్ల మధ్య శనివారం (ఏప్రిల్ 2) మ్యాచ్‌ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముంబయి బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్ జట్టులోకి వచ్చేస్తున్నాడు. దీంతో ముంబయి మిడిలార్డర్‌ బలోపేతం అవుతుందని జట్టు యాజమాన్యం భావిస్తోంది.

హైదరాబాద్‌ మీద భారీ విజయంతో రాజస్థాన్‌ హుషారుగా ఉంది. మరోవైపు మొదటి మ్యాచ్‌లో దిల్లీ చేతిలో ముంబయి ఓటమి చవిచూసింది. ఓపెనింగ్ బాగున్నా.. మిడిలార్డర్‌లో పరుగులు చేయడంలో ముంబయి విఫలం కావడం వల్ల భారీ స్కోరు చేసే అవకాశం చేజారింది. బౌలింగ్‌లోనూ బుమ్రా (3.2-0-43) భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. కుర్రాళ్లు బసిల్ థంపి (3/35), మురుగన్‌ అశ్విన్ (2/14) మాత్రమే రాణించారు.

ఇదీ చూడండి:'ధోనీని చాలా రోజుల తర్వాత కలిశా.. సంతోషంగా ఉంది'

ABOUT THE AUTHOR

...view details